జాంబీ రెడ్డి 2 నెక్స్ట్ లెవల్’లో ఉపేంద్ర ఫస్ట్ లుక్.. వైల్డ్ అవతార్‌లో కన్నడ స్టార్

జాంబీ రెడ్డి 2 నెక్స్ట్ లెవల్’లో ఉపేంద్ర ఫస్ట్ లుక్.. వైల్డ్ అవతార్‌లో కన్నడ స్టార్

కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్న  తెలుగు చిత్రం ‘జాంబీ రెడ్డి 2 నెక్స్ట్ లెవల్’. తేజ సజ్జా హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సుపర్ణ్ ఎస్. వర్మ  దర్శకత్వం వహిస్తున్నారు.  ‘జాంబీ రెడ్డి’తో తెలుగు సినిమాకు జాంబీ జానర్‌‌ను పరిచయం చేసిన ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి క్రియేటర్‌‌గా వ్యవహరిస్తున్నాడు.  శుక్రవారం ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌ను విడుదల చేశారు మేకర్స్.  

ఇందులో ఆయన్ను  ఇంతకుముందెన్నడూ చూడని వైల్డ్, ఫియర్స్, లార్జర్ దేన్ లైఫ్ అవతార్‌‌లో ప్రజెంట్ చేశారు.  భారీ చెట్టు కొమ్మకు తలకిందులుగా వేలాడుతూ.. ఒక చేతిలో పొడవైన ఆయుధాన్ని పట్టుకుని కనిపించాడు.  ‘ప్రపంచాన్ని తలకిందులు చేయడానికి సిద్ధం’ అని పోస్టర్‌‌‌‌పై ఉన్న క్యాప్షన్‌‌ ఆయన క్యారెక్టర్‌‌‌‌పై క్యూరియాసిటీని పెంచుతోంది.  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు.  ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, నేపాలీ, జపనీస్ భాషల్లో విడుదల కు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.