Upendra Chiranjeevi: నా డైరెక్షన్లో చిరంజీవితో కచ్చితంగా సినిమా చేస్తా: విలక్షణ నటుడు, దర్శకుడు ఉపేంద్ర

Upendra Chiranjeevi: నా డైరెక్షన్లో చిరంజీవితో కచ్చితంగా సినిమా చేస్తా: విలక్షణ నటుడు, దర్శకుడు ఉపేంద్ర

విలక్షణ నటుడిగా, దర్శకుడిగా కన్నడ స్టార్ ఉపేంద్రకు టాలీవుడ్‌‌లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలంటే ఇష్టపడే ఆడియన్స్ చాలా మందే ఉన్నారు. గతంలో ''రా' అంటూ ఒక అక్షరాన్నే టైటిల్గా పెట్టిన అభిమానులను అలరించారు ఉపేంద్ర. అంతేకాదు అసలు టైటిలే లేకుండా కేవలం సింబల్ను వాడి మూవీ తీసిన ఘనత ఉపేంద్రది. అలాంటి విలక్షణ దర్శకుడు ఉపేంద్రకి.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడం తన డ్రీమ్ అని వెల్లడించారు.

ఇప్పటికే పలు తెలుగు చిత్రాలతో మంచి ఆదరణ దక్కించుకున్న ఆయన.. రామ్ హీరోగా నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలుకా’ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ పోషించారు. పి మహేష్ బాబు దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీ నవంబర్ 27న  విడుదలవుతోంది.

ఈ సందర్భంగా ఉపేంద్ర చెప్పిన విశేషాలు. ‘ఈ కథని ఒక ప్రేక్షకుడిగా విని చాలా కనెక్ట్ అయ్యాను. అందరి జీవితంలో ఇలాంటి ఎమోషన్  ఉంటుంది. అసలు అభిమానుల ప్రేమకు లాజిక్ ఉండదు. ఎందుకు ఇంతగా ప్రేమిస్తారు, దానికి మనం అర్హులమేనా అనిపిస్తుంటుంది. అందుకు నేను బాగా కనెక్ట్ అయ్యాను. ఒక స్టార్ జీవితం ఎలా ఉంటుందో నేను పోషించిన సూర్య పాత్ర  అలానే ఉంటుంది.  ఫ్యాన్స్ క్రేజ్, కెరీర్‌‌‌‌లో అప్ అండ్ డౌన్స్ లాంటివన్నీ ఉంటాయి. హ్యూమన్ ఎమోషన్స్, లవ్, రిచ్ పూర్‌‌‌‌కి మధ్య ఉండే ఒక సంఘర్షణ సహా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి.

ఒక స్టార్‌‌‌‌ హీరోకి అభిమానికి మధ్య ఉండే ఎమోషన్‌‌ని చాలా అద్భుతంగా చెప్పారు. అది చాలా కొత్తగా అనిపిస్తుంది. ఒక్కొక్క  డైలాగ్ మనసును హత్తుకునేలాగా ఉంటాయి. ఇలాంటి మంచి సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. ఫ్యాన్స్‌‌కి ఏదైనా చెప్పాలని ఒక కోరిక ఉంటుంది. అది ఈ సినిమాతో దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది.

రామ్ వెరీ ఎనర్జిటిక్ పెర్ఫార్మర్. ఇంటర్వెల్ సీక్వెన్స్‌‌లో ఆయన యాక్షన్ చూస్తే గూస్‌‌బంప్స్ వస్తాయి. ఒక రియల్ ఫ్యాన్‌‌లాగా నటించారు. ఒక స్టార్ అయి ఉండి అలా నటించడం అంత ఈజీ కాదు. అభిమానిలో ఉండే అమాయకత్వం, ఎనర్జీ, మాస్ లాంటివన్నీ అద్భుతంగా కనిపించాయి. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. ఇక నా డైరెక్షన్‌‌లో చిరంజీవి గారితో సినిమా చేయాలనేది డ్రీమ్. అన్ని కుదిరితే కచ్చితంగా చేస్తాను’’అని ఉపేంద్ర తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. 

ఉపేంద్రకి- మెగాస్టార్ చిరంజీవి:

హీరో కం డైరెక్టర్ ఉపేంద్రకి.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడం తన డ్రీమ్ అని వెల్లడించారు. గతంలో 'ఓం' సినిమా సక్సెస్ తర్వాత.. చిరంజీవితో ఉపేంద్ర ఓ మూవీ చేయాల్సి ఉంది. కానీ, ఆ ప్రాజెక్ట్ చర్చల దశలోనే ఆగిపోయింది. "మెగాస్టార్‌డమ్" మరియు బ్రాండ్ ఇమేజ్‌కి కథ సరిపోలడం లేదని, అందువల్ల తానే ఆ అవకాశం నుండి వెనక్కి తగ్గాడని ఉపేంద్ర వివిధ ఇంటర్వ్యూలలో వెల్లడించాడు. ఇది అతి పెద్ద రిగ్రెట్ గా భావిస్తానని ఉపేంద్ర చాలా సార్లు చెప్పుకొచ్చాడు. ఇపుడు మరోసారి చిరుని డైరెక్ట్ చేయాలనీ చెప్పడంతో.. మళ్ళీ ఈ కాంబో హాట్ టాపిక్ అయింది. భవిష్యత్తులో ఏమవుతుందో చూడాలి.