ఫోన్ పే, గూగుల్ పేలకు పోటీ పడుతున్న యూపీఐ యాప్స్..!

ఫోన్ పే, గూగుల్ పేలకు పోటీ పడుతున్న యూపీఐ యాప్స్..!

పర్సులో క్యాష్ మెయింటైన్ చేయటం ఇప్పుడు చాలా రేర్ అయ్యింది. ఇందుకు కారణం యూపీఐ పేమెంట్స్ సిస్టం అందుబాటులొకి రావటమే. తోపుడు బండి దగ్గర నుండి షాపింగ్ మాల్స్ వరకూ అన్ని చోట్ల యూపీఐ పేమెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈ యూపీఐ పేమెంట్స్ వల్ల చిల్లర బాధ తప్పటమే కాకుండా లావాదేవీలు స్పీడ్ గా జరిగే అవకాశం ఉంది. చిన్న మొత్తం నుండి పెద్ద మొత్తం వరకూ  పేమెంట్స్ చేసుకునే వెసలుబాటు ఉండటంతో ఇప్పుడు అందరూ యూపీఐ పేమెంట్స్ నే ప్రిఫర్ చేస్తున్నారు.

జనాలు ఇంతగా యూపీఐ పేమెంట్స్ కి అలవాటు పాడటానికి మరొక కారణం క్యాష్ బ్యాక్ ఆఫర్స్. యూపీఐ మొదలైన కొత్తలో క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఇచ్చి కస్టమర్స్ ని అట్రాక్ట్ చేశాయి పేటీఎమ్, గూగుల్ పే, ఫోన్ పే వంటి సంస్థలు. ఇప్పుడు ఈ సంస్థలే యూపీఐ మార్కెట్ ని లీడ్ చేస్తున్నాయి. ప్రస్తుతం NPCI చిన్న మొత్తంలో చేసే పేమెంట్స్ కి పాస్వర్డ్ అవసరం లేకుండా యూపీఐ లైట్ యాప్ ని తీసుకొచ్చింది. యూపీఐ లైట్ యాప్ ని ప్రోత్సహించేందుకు క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ని ఇస్తున్నాయి ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.

ఫోన్ పే, గూగుల్ పే తరహాలో క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఇవ్వలేమంటూ కొన్ని యాప్స్ NPCI ని సంప్రదించాయి. ఒకవేళ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఇచ్చినా కూడా మార్కెట్ షేర్లో 95శాతం మేర ఉన్న ఫోన్ పే, గూగుల్ పే లాంటి సంస్థలతో పోటీ పడలేమని తెలిపాయి. సదరు సంస్థల అభ్యర్థన విన్న NPCI త్వరలోనే తమ సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులేస్తామని హామీ ఇచ్చింది. ఇందుకోసం ప్రతి నెల సమీక్షలు నిర్వహిస్తామని, ఈ ఏడాది డిసెంబర్ కల్లా ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని హామీ ఇచ్చింది. కష్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు క్యాష్ బ్యాక్, ఇన్సెంటివ్స్ వంటి ఆఫర్స్ పెంచాలని తెలిపింది. NPCI ని సంప్రదించిన సంస్థల్లో అమెజాన్ పే, స్లైస్, జూపిటర్, బజాజ్ పే, వంటి సంస్థలు ఉన్నాయి.