హైదరాబాద్, వెలుగు: స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్వాడకం విపరీతంగా పెరగడంతో తెలంగాణలో డిజిటల్ చెల్లింపులు భారీగా పెరుగుతున్నాయని 'హౌ అర్బన్ ఇండియా పేస్ 2025' రిపోర్ట్ వెల్లడించింది. అమెజాన్‌పే– కెర్నీ కలిసి ఈ రిపోర్టును తయారు చేశాయి. దీని ప్రకారం, హైదరాబాద్ .. యూపీఐ, క్యాష్‌లెస్ పేమెంట్స్ వాడకంలో ఇతర మెట్రో నగరాలతో సమానంగా ఉంది. దక్షిణాదిలోని పెద్ద, మధ్య తరహా నగరాల్లో ఆఫ్‌లైన్ లావాదేవీల్లో 35 శాతం, ఆన్‌లైన్‌లో 52 శాతం యూపీఐ ద్వారా జరుగుతున్నాయి.
హైదరాబాద్‌నుంచి డిజిటల్ చెల్లింపులు వార్షికంగా 33 శాతం పెరిగాయని అమెజాన్ పే ఇండియా సీఈఓ వికాస్ బన్సాల్ తెలిపారు. అమెజాన్ పే వాడకం టైర్ 2, టైర్ 3 నగరాల్లో 70 శాతం వృద్ధికి దోహదపడుతోందని చెప్పారు. నగర కస్టమర్లు అత్యవసరం కాని వస్తువుల కొనుగోళ్లకు వాలెట్స్, క్రెడిట్ కార్డ్స్ వాడుతున్నారని వివరించారు.
