
- తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడలో జమ్దాని చీరలు ఫేమస్
- వందేళ్ల కన్నా ముందే ఉప్పాడచేరిన ‘ఢాకాయ్ జమ్దాని’
- తర్వాత సొంత డిజైన్ తయారు చేసుకున్న స్థానికులు
- ఊర్లో ఎక్కడ చూసినా ఇవే శారీలు
- రాజకీయ నేతలు,సినీ స్టార్లు కూడా ఫిదా
ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలోఉంటుంది ఉప్పాడ. కాకినాడ దాటికోస్టల్ హైవే పైకి ఎక్కడంతోనే ఉప్పాడకు దగ్గరవుతున్నామని మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే వెళ్తుంటే దారిపై ఎటు చూసినా సైన్ బోర్డులు, బ్యానర్లు.. ముందుకెళ్లే కొద్దీ రిటైల్ షాపులు, హోల్ సేల్ ఔట్లెట్లు కనిపిస్తాయి . ఊర్లో కార్ఖానాలు, ఇళ్లల్లో చేనేతమగ్గాల చప్పుడు వినిపిస్తుంది. దుకాణాల నిండా పట్టుచీరలే కనిపిస్తాయి . ఊర్లో నేసేవి కూడా పట్టు చీరలే.‘ఉప్పాడ పట్టు చీరలు’గా ఇవి ఫేమస్. మరి ఉప్పాడపట్టు పుట్టినిల్లు ఏది? ఈ డిజైన్ ఎక్కడిది?
ఢాకాయ్ జమ్దాని
నికాంచీ వరం పట్టుతో పోలిస్తే, ఉప్పాడ సిల్క్మృదువుగా, నాణ్యతతో ఉంటుంది. ఢాకాయ్ జమ్దాని(జమ్దాని అనేది పర్షియన్ పదం. అంటే పూలకుండీఅని అర్థం ) పేరుతో ఎన్నో ఏళ్ల కిందటే బంగ్లాదేశ్లో ఇలాంటి చీరలను నేసేవారు. అటు నుంచి బెంగాల్మీదుగా ఆంధ్రప్రదేశ్ లోని తీర ప్రాంతం ఉప్పాడకు ఈ డిజైన్ చేరింది. నిజానికి జమ్దాని పద్ధతి ఇక్కడిదాకా ఎలా వచ్చిందనే దానిపై స్పష్టమైన సమాచారంలేదు. వందల ఏళ్ల క్రితం బంగ్లాదేశ్ చేనేత కారులు ఇక్కడికి వలస వచ్చారని చెబుతారు. ‘‘జమ్దాని సరిహద్దులను దాటి ఉప్పాడ వరకు వచ్చింది. విలక్షణమైన సొంత డిజైన్ ను సృష్టించడంలో, దాన్ని కాపాడుకోవడంలో ఉప్పాడ విజయవంతమైంది” అని చేనేతవస్త్రాల ఎక్స్పర్ట్ అల్లీ మథన్ చెబుతారు.
రాజవంశీయుల కోసం
ఉప్పాడ పట్టును తూర్పుగోదావరి జిల్లా లోని ఉప్పాడ,కొత్తపల్లి గ్రామాల్లో ఎక్కువగా నేస్తారు. అప్పట్లో ఆప్రాంతంలోని ధనికులు, ప్రముఖులు వీటిని ఆదరించారు. అంతకుముందు పిఠాపురం, వెంకటగిరి ,బొబ్బిలి రాజవంశాల మహిళల కోసం ప్రత్యేకమైనడిజైన్లలో చీరలు తయారు చేసేవారు. ఇలా నేసినచీరలను ఇతరులకు అమ్మనిచ్చే వారు కాదు. తర్వాతి కాలంలో రాజకీయ నేతలు కూడా ఉప్పాడ సిల్క్ వైపేమొగ్గు చూపారు. దివంగత తమిళనాడు మాజీ సీఎంజయలలిత నుంచి కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వరకు చాలా మంది నేతలు నేరుగా చేనేత కారుల నుంచి చీరలు కొనుగోలు చేసేవారు.2009లో ఉప్పాడ చీరలకు జీఐ (జియోగ్రాఫికల్ఇండికేషన్) ట్యాగ్ వచ్చింది. ఇది స్థానిక వర్కర్ల ప్రతిష్ట పెంచింది. ఇక్కడ మూడు తరాలుగా సిల్క్ చీరల వ్యాపారం, చేనేత పనిలో ఉన్నవారు చాలా మందే ఉన్నారు.
సినిమా యాక్టర్ల ఆర్డర్లు
కాటన్ కంటే సిల్క్ చీరలకే ఎక్కువగా డిమాం డ్ ఉంటోం దని స్థానిక దుకాణం యజమాని ప్రదీప్ చెప్పారు. రూ.3 వేల నుంచిరూ.లక్ష వరకు పలు డిజైన్లలో, రేట్లలో చీరలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ నుంచి సినిమా యాక్టర్లు వచ్చి ప్రత్యేకంగా ఆర్డర్లు ఇచ్చి వెళ్తారని వివరించారు. ఇటీవల కాజల్ అగర్వాల్ వంటి హీరోయిన్లు కూడా ఉప్పాడ పట్టు చీరలతో పబ్లిక్ లో కనిపి స్తున్నారు.