
- ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
మేడ్చల్ కలెక్టరేట్, వెలుగు: ఉప్పల్ లోని హెచ్ బీ కాలనీ కమ్యూనిటీ హాల్ వేలాన్ని నిలిపివేయాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. కమ్యూనిటీ హాల్ ను జీహెచ్ఎంసీకి అప్పగించి, స్థానిక ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ కు వినతిపత్రాలు అందజేశారు.
దీనిపై వారు సానుకూలంగా స్పందించి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కార్పొరేటర్ జేరిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాసరెడ్డి, కాలనీ ఫేజ్--1 సంక్షేమ సంఘం అధ్యక్షుడు శివరాంప్రసాద్, ఫేజ్–-2 అధ్యక్షుడు వెంకటాచారి, నాయకులు గోవిందరెడ్డి, చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.