ఉప్పల్ పోలీసులకు ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్ సన్మానం.. మెమెంటోలు బహుకరించిన సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ క్రికెటర్ అభిషేక్ శర్మ

ఉప్పల్ పోలీసులకు ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్ సన్మానం.. మెమెంటోలు బహుకరించిన సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ క్రికెటర్ అభిషేక్ శర్మ

ఉప్పల్, వెలుగు: ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్​లకు బందోబస్తును సమర్థవంతంగా నిర్వహించిన స్థానిక పోలీసు అధికారులు, సిబ్బందికి సన్​రైజర్స్ హైదరాబాద్ స్టార్ క్రికెటర్ అభిషేక్ శర్మ మెమెంటోలు బహుకరించారు. మ్యాచ్​ల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణలో నిబద్ధతతో విధులు నిర్వహించిన ఎస్సైలు చిరంజీవి, మధు, హెడ్ కానిస్టేబుల్ జంగయ్యను ఆయన ప్రత్యేకంగా సన్మానించి, జ్ఞాపికలను అందజేశారు. మల్కాజిగిరి సీపీ సుమతి, ఉప్పల్ డీసీపీ సురేశ్ కుమార్, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీ వెంకట్ రెడ్డి, ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓ రామలింగ రెడ్డి, డీఐ రవికుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.