రివ్యూ: ఉప్పెన

రివ్యూ: ఉప్పెన

రివ్యూ: ఉప్పెన
రన్ టైమ్ : 2 గంటల 25 నిమిషాలు
నటీనటులు: వైష్ణవ్ తేజ్,కృతి శెట్టి,విజయ్ సేతుపతి,సాయి చంద్,ప్రియ తదితరులు
మ్యూజిక్: దేవీ శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ : శ్యామ్ దత్
ఎడిటింగ్ : నవీన్ నూలి
నిర్మాతలు: మైత్రీ మూవీస్
రచన,దర్శకత్వం: బుచ్చిబాబు సాన
రిలీజ్ డేట్: ఫిబ్రవరి 12,2021

కథేంటి?
బేబమ్మ (కృతి శెట్టి) పెద్దింటి అమ్మాయి.పేదవాడైన అశి (వైష్ణవ్ తేజ్) చిన్నప్పటినుంచే ప్రేమిస్తాడు.పెద్దయ్యాక ఇద్దరూ ప్రేమించుకుంటారు బేబమ్మ తండ్రి రాయణం (విజయ్ సేతుపతి) పరువే ప్రాణంగా బతికే వ్యక్తి.తన కూతుర్ని తన కులం వాడికే ఇచ్చి పెళ్లి చేద్దామనుకుంటాడు. అలాంటిది అశి తన కూతుర్ని ప్రేమిస్తున్నాడని తెలుసుకొని అతన్ని ఏం చేశాడు.? వాళ్లిద్దరి ప్రేమని ఒప్పుకున్నాడా? చివరికి అశి,బేబి కలుసుకున్నారా లేదా.అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటుల పర్ఫార్మెన్స్:
ఫస్ట్ మూవీయే అయినా వైష్ణవ్ తేజ్ తన నటనతో ఆకట్టుకున్నాడు.లుక్స్ కూడా బాగున్నాయి.అతనికి మంచి ఫ్యూచర్ ఉంది.హీరోయిన్ కృతి శెట్టి అందం,అభినయంతో మెప్పించింది.క్లైమక్స్ లో మంచి పర్ఫారెన్స్ తో కట్టిపడేస్తుంది.విజయ్ సేతుపతి లాంటి నటుడి ముందు పవర్ ఫుల్ డైలాగులతో నటించినందుకు అభినందించాల్సిందే. ఇక విజయ్ సేతుపతి ఇందులో ఫుల్ సీరియస్ పాత్రలో కనిపించాడు.పవర్ ఫుల్ గా నటించి మరోసారి మెప్పించాడు.అయితే తనకు ఆ డబ్బింగ్ వాయిస్ పెద్దగా సూట్ కాలేదు.సాయి చంద్ కు మంచి పాత్ర దక్కింది.మిగతా నటీనటులు ఫర్వాలేదనిపించారు.

టెక్నికల్ వర్క్:
ఈ సినిమాకు పెద్ద ప్లస్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్.రిలీజ్ కు ముందు పాటలతో మెస్మరైజ్ చేసిన దేవీ,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కూడా వావ్ అనిపించాడు.సీన్ల ఎలివేషన్ లకు రీ-రికార్డింగ్ చాలా హెల్ప్ అయింది. శ్యామ్ దత్ విజువల్స్ అందంగా ఉన్నాయి.బీచ్ అందాలను చాలా గ్రాండ్ గా చూపించాడు.ఎడిటింగ్ బాగుంది.ఆర్ట్ వర్క్ పర్ఫెక్ట్ గా ఉంది.డైలాగులు చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయి.

విశ్లేషణ:

‘‘ఉప్పెన’’ కొత్త కథేం కాదు. మనకు తెలిసిన ప్రేమకథ లు ఎలా ఉంటాయో అలాగే మొదలవుతుంది.కానీ ఎండింగ్ లో కొత్త పాయింట్ పెట్టేసరికి ఈ మూవీకి హైప్ వచ్చింది. ఆ పాయింట్ ను జనాలు రిసీవ్ చేసుకుంటారో అనేది చూడాలి.ఇక సినిమా విషయానికొస్తే.. ఫస్టాఫ్ అంతా సాఫీగా సాగిపోతుంటుంది.హీరో హీరోయిన్ల పరిచయం, ప్రేమ ఇలా సరదాగా వెళ్తుంది.ఇంటర్వెల్ లో హీరోయిన్ తండ్రికి నిజం తెలియడంతో అసలైన కథ మొదలవుతుంది.వాళిద్దరూ పారిపోవడం,వేరే ఊళ్లో ఉండటం ఇదంతా సాగదీతగా అనిపిస్తుంది. స్లో నరేషన్, క్యారెక్టరైజేషన్ కరెక్ట్ గా లేకపోవడం ఇలా ఇబ్బందిగా అనిపస్తుంది. కానీ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లలో డైరెక్టర్ తన పెన్ పవర్ చూపించాడు.పదునైన సంభాషణలతో కన్వీన్సింగ్ గా క్లైమాక్స్ ను నడిపాడు. తద్వారా ప్రేక్షకులు ఎమోషనల్ ఫీల్ తో బయటకు వస్తారు.ఇలాంటి ఓ బోల్డ్ పాయింట్ ను హ్యాండిల్ ను చేయడంలో మేజర్ పార్ట్ వరకు డైరెక్టర్ బుచ్చిబాబు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.అయితే ఎక్స్ పెక్ట్ చేసినంత లేకపోవడం,సెకండాఫ్ వీక్ గా ఉండటం వల్ల బోర్ ఫీలవుతారు.ఓవరాల్ గా ఈ హార్డ్ హిట్టింగ్ లవ్ స్టోరీని ఓకసారి చూసి ఎంజాయ్ చేయవచ్చు.

బాటమ్ లైన్: ఉప్పెనంత హైప్, గుప్పెడంత స్టోరీ