జనాభా ఎక్కువున్నా కరోనాను బాగా కంట్రోల్ చేస్తున్నరు

జనాభా ఎక్కువున్నా కరోనాను బాగా కంట్రోల్ చేస్తున్నరు

వారణాసి: ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వంపై ప్రశంసల జల్లులు కురిపించారు. దేశంలోనే అత్యంత జనాభా ఉండే యూపీ.. కరోనాను అద్భుతంగా కంట్రోల్ చేసిందని మోడీ అభినందించారు. వారణాసిలో రూ.1,500 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోడీ.. యూపీలో జరుగుతున్న అభివ‌ృద్ధి, కరోనాను యోగి సర్కార్ ఎదుర్కొన్న తీరు, వ్యాక్సినేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా టెస్టులు, వ్యాక్సినేషన్‌లో యూపీ ఎంతో ముందుందని  మెచ్చుకున్నారు. 

‘కరోనాపై పోరులో ఉత్తర ప్రదేశ్ దీటుగా ఎదురొడ్డి పోరాడుతోంది. భారత్‌లో అధిక జనాభా ఉండే యూపీ.. కరోనాను కంట్రోల్ చేసిన  తీరు నిజంగా అద్భుతం. దేశంలో ఎక్కువ సంఖ్యలో కరోనా టెస్టులు చేస్తున్న రాష్ట్రంగా యూపీ నిలిచింది. అత్యధిక వ్యాక్సిన్‌లు ఇచ్చిన స్టేట్స్ లిస్ట్‌లో కూడా యూపీనే ముందంజలో ఉంది. వైరస్‌‌తో ఫైట్‌లో పోరాడుతున్న కరోనా వారియర్స్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నా. ఆధునిక ఉత్తర ప్రదేశ్‌ను నిర్మించే దిశలో సీఎం యోగి ఆదిత్యనాథ్ వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఒకప్పుడు ఈ రాష్ట్రంలో మాఫియా రాజ్యం ఉండేది. కానీ ఇప్పుడు చట్టం ప్రకారం అన్నీ నడుస్తున్నాయి’ అని మోడీ పేర్కొన్నారు.