
కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో 827 మెడికల్ ఆఫీసర్ల నియామకానికి జులై 14న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాత పరీక్షను నిర్వహించింది. తాజాగా కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్- 2024 రాతపరీక్ష ఫలితాలను బోర్డు విడుదల చేసింది. సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో ఇంటర్వ్యూ/పర్సనాలిటిటీ టెస్ట్ నిర్వహించనున్నారు.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్-2024 నోటిఫికేషన్‌ను ఈ ఏడాది ఏప్రిల్ 10న విడుదల చేసింది. ఎంబీబీఎస్ పూర్తి చేసిన లేదా.. ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థుల నుంచి ఏప్రిల్ 10 వరకు దరఖాస్తులు స్వీకరించింది. పరీక్ష జులై 14న నిర్వహించింది.
కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఫలితాలు ఇలా చూసుకోండి..
* ఫలితాల కోసం అభ్యర్థులు మొదట యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి-https://upsc.gov.in/
* అక్కడ హోంపేజీలో whats-new సెక్షన్‌లో సీఎంఎస్‌ఈ ఫలితాలకు సంబంధించిన లింక్ మీద క్లిక్ చేయాలి.
* పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉన్న ఫలితాలకు సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది.
* అక్కడ కనిపించే బాక్సులో తమ రూల్ నెంబరు నమోదుచేయాలి.
* అభ్యర్థులు ఒకవేళ పరీక్షలో అర్హత సాధిస్తే పీడీఎఫ్‌లోని ఫలితాల్లో చూపిస్తుంది.
* ఫలితాల పీడీఎఫ్ పేజీని డౌన్‌లోడ్ చేసుకోండి.. భవిష్యత్ అవసరాల కోసం ఉపయోగపడొచ్చు భద్రపరుచుకోండి