ఇంటర్​తో డిఫెన్స్​ సర్వీస్​

ఇంటర్​తో డిఫెన్స్​ సర్వీస్​

నేషనల్‍ డిఫెన్స్ అకాడమీ(ఎన్‍డీఏ) & నావల్‍ అకాడమీ(ఎన్‌‌ఏ–2) 2021 ఎగ్జామినేషన్‍కు యూనియన్‍ పబ్లిక్‍ సర్వీస్‍ కమిషన్‍ నోటిఫికేషన్ రిలీజ్​ చేసింది. ఈ ఎగ్జామ్​ ద్వారా ఇంటర్​ అర్హతతోనే ఆర్మీ, నేవీ, ఎయిర్‌‌ఫోర్స్, నావల్‍ అకాడమీల్లో లెఫ్టినెంట్, సబ్ లెఫ్టినెంట్, ఫ్లైయింగ్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగంతో పాటు డిగ్రీ పట్టా పొందవచ్చు. ఈసారి ఎన్‍డీఏ & ఎన్‍ఏ పరీక్ష ద్వారా యూపీఎస్సీ 400 ఖాళీలను భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకోవడానికి అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఎంపికైన వారికి 2 జులై 2022 నుంచి కోర్సు ప్రారంభం అవుతుంది.

కోర్సు: ఎన్​డీఏ 148, ఎన్​ఏ 110
ఖాళీలు: 400(నేషనల్​ డిఫెన్స్​ అకాడమీ–370
(ఆర్మీ–208, నేవీ–42, ఎయిర్​ఫోర్స్​–120)
నావల్​ అకాడమీ(10+2 క్యాడెట్​ ఎంట్రీ స్కీమ్​)–30
అర్హత: ఆర్మీ వింగ్​ పోస్టులకు ఇంటర్మీడియట్​(10+2)/తత్సమాన ఉత్తీర్ణత. ఎయిర్​ ఫోర్స్​, నావల్​ వింగ్స్​ పోస్టులకు ఫిజిక్స్​, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్​ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్​(10+2) ఉత్తీర్ణత. ఇంటర్​ సెకండ్​ ఇయర్​ చదువుతున్న స్టూడెంట్స్​ కూడా అప్లై చేసుకోవచ్చు.
వయసు: 2003 జనవరి 2 నుంచి 2006 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి.
సెలెక్షన్​ ప్రాసెస్: రిటెన్​ టెస్ట్​, ఫిజికల్‍ ఆప్టిట్యూడ్‍ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో క్వాలిఫై అయిన వారికి తర్వాతి దశలో సర్వీస్ సెలక్షన్ బోర్డు (ఎస్‌‌ఎస్‌‌బీ) ద్వారా ఫిజికల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (పీఏటీ), ఇంటెలిజెన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇంటెలిజెన్స్ టెస్ట్‌‌లో వెర్బల్, నాన్ వెర్బల్ పరీక్షలతో పాటు గ్రూప్ డిస్కషన్, గ్రూప్ ప్లానింగ్, ఔట్ డోర్ గ్రూప్ టాస్క్స్ ఉంటాయి. ఎయిర్‌‌ఫోర్స్ విభాగంలో చేరే వారికి కంప్యూటరైజ్డ్ పైలట్ సెలక్షన్ సిస్టమ్ అనే మరో పరీక్ష కూడా ఉంటుంది. వీటి తర్వాత మెడికల్​ టెస్ట్​ ఉంటుంది. ఫైనల్​గా సెలెక్ట్ అయిన అభ్యర్థులు మూడు, నాలుగు సంవత్సరాల డిగ్రీ కోర్సులు చదవాల్సి ఉంటుంది. కోర్సు సక్సెస్​ఫుల్​గా కంప్లీట్​ చేసిన వారికి తర్వాతి దశలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. 
దరఖాస్తులు: ఆన్​లైన్​లో..
అప్లికేషన్​ ఫీజు: రూ.100
దరఖాస్తులకు చివరి తేది: జూన్​ 29
ఎగ్జామ్​ తేది: అక్టోబర్​ 5
వెబ్​సైట్​: www.upsc.gov.in