తమిళ దర్శకుడితో రామ్ నెక్ట్స్ ప్రాజెక్ట్.. కెరీర్‌‌‌‌‌‌‌‌లోనే హ్యూజ్ బడ్జెట్‌‌‌‌తో మూవీ

తమిళ దర్శకుడితో రామ్ నెక్ట్స్ ప్రాజెక్ట్.. కెరీర్‌‌‌‌‌‌‌‌లోనే హ్యూజ్ బడ్జెట్‌‌‌‌తో మూవీ

గత ఏడాది ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన రామ్ పోతినేని.. త్వరలో ఓ యాక్షన్‌‌‌‌ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌లో నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ఎన్నో అంచనాలు పెట్టుకున్న గత చిత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోవడంతో తన కొత్త సినిమా ఎంపిక విషయంలో రామ్ ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ యువ దర్శకుడి స్టోరీకి గ్రీన్‌‌‌‌ సిగ్నల్‌‌‌‌ ఇచ్చినట్టు తెలుస్తోంది.  

ప్రముఖ తమిళ దర్శకుడు లోకేష్‌‌‌‌ కనగరాజ్‌‌‌‌ దగ్గర అసోసియేట్‌‌‌‌గా వర్క్‌‌‌‌ చేసిన  ఓ వర్థమాన దర్శకుడు ఇటీవల  రామ్‌‌‌‌ను కలిసి స్టోరీ వినిపించినట్టు టాక్.  యాక్షన్‌‌‌‌ కంటెంట్‌‌‌‌తో రూపొందే ఈ ప్రాజెక్ట్‌‌‌‌కు రామ్ ఓకే చెప్పినట్టుగా సమాచారం. తన కెరీర్‌‌‌‌‌‌‌‌లోనే హ్యూజ్ బడ్జెట్‌‌‌‌తో ఈ యాక్షన్‌‌‌‌ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌ ఉండబోతోందట. చివరిదశ చర్చల్లో ఉన్న ఈ ప్రాజెక్ట్‌‌‌‌ గురించి త్వరలో అనౌన్స్‌‌‌‌మెంట్‌‌‌‌ రానుంది.