రౌడీ బాయ్స్, లవ్ మీ సినిమాలతో హీరోగా ఆకట్టుకున్న ఆశిష్.. త్వరలో ‘దేత్తడి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంతో ఆదిత్య రావు గంగసాని దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మంగళవారం గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఇందులో హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని పండుగలు, వేడుకలకు ఉత్సాహాన్ని నింపే పాపులర్ డ్రమ్మర్ ఘన్ను భాయ్ వరల్డ్‌ని ప్రజెంట్ చేశారు. బ్యాండ్ వాయించే డ్రమ్మర్ పాత్రలో ఆశిష్ కనిపించిన తీరు ఇంప్రెస్ చేసింది.
ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో ఆశిష్ మాట్లాడుతూ ‘మన హైదరాబాద్ కల్చర్‌ని ఒక రేంజ్‌లో చూపించబోతున్నాం. ప్రతి బ్యాండ్ గర్వపడేలా సినిమా ఉంటుంది’ అని చెప్పాడు. అందరికీ గుర్తుండిపోయే సినిమా ఇదని దర్శకుడు ఆదిత్యరావు అన్నాడు. దిల్ రాజు మాట్లాడుతూ ‘ఒక బ్యాండ్ కొట్టుకునే కుర్రాడి కథ ఇది. హైదరాబాద్ కల్చర్‌ని ప్రపంచానికి గొప్పగా చూపించబోతున్నాం’ అని చెప్పారు. జాతర త్వరలో ప్రారంభమవుతుందని నిర్మాత శిరీష్ అన్నారు.
