అవగాహన తోనే క్షయ నిర్మూలన సాధ్యం : కలెక్టర్‌‌‌‌‌‌‌‌ సత్య శారదాదేవి

అవగాహన తోనే క్షయ నిర్మూలన సాధ్యం : కలెక్టర్‌‌‌‌‌‌‌‌ సత్య శారదాదేవి

కాశీబుగ్గ/ పర్వతగిరి, వెలుగు: క్షయవ్యాధి నిర్మూలన అవగాహనతోనే సాధ్యం అవుతుందని, వరంగల్ జిల్లాను క్షయ రహితంగా తీర్చిదిద్దేందుకు సమష్టిగా పని చేయాలని కలెక్టర్‌‌‌‌‌‌‌‌ సత్య శారదాదేవి అన్నారు. మంగళవారం ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా సిటీలోని సీకేఎం కాలేజ్ జంక్షన్ నుంచి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, దేశాయిపేట వరకు చేపట్టిన ర్యాలీని కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, డీఎంహెచ్​వో  బి.సాంబశివరావు కలిసి ప్రారంభించారు. క్షయ వ్యాధిపై జాగ్రత్తలు పాటించాలని సూచించారు. 

పర్వతగిరి సోషల్​ వెల్ఫేర్​ స్కూల్​లో ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్య, సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో బాలల భద్రత, సైబర్ నేరాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్​ పాల్గొని మాట్లాడారు. సైబర్​ నేరాలపై స్టూడెంట్లు అలర్ట్​గా ఉండాలని సూచించారు. అనంతరం కిచెన్, స్టోర్​రూమ్​ను పరిశీలించి, విద్యార్థులకు అందుతున్న భోజనాన్ని రుచి చూసి, స్టూడెంట్ల సమస్యలను తెలుసుకున్నారు.