ఊకే మొరుగుతుందని వీధికుక్కను చంపిండు

ఊకే మొరుగుతుందని వీధికుక్కను చంపిండు

ఊకే మొరుగుతుందన్న కారణంతో ఓ వ్యక్తి  వీధికుక్కను హతమార్చాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది. నిరంతరం అరుస్తుందని విసుగు చెందిన ఓ వ్యక్తి ఇటుకతో కుక్కను చంపాడని అధికారులు తెలిపారు. ఈ ఘటన ఆ ప్రాంతంలోని ఓ దుకాణంలో ఉన్న సీసీటీవీలో రికార్డైంది. ఈ వీడియో క్లిప్‌లో జాకీ అనే వ్యక్తి కుక్క దగ్గరకు వెళ్లి దాని తలపై ఇటుకను విసిరినట్లు తెలుస్తోంది.

వీధి కుక్కను చంపినట్టుగా చూపే  సీసీటీవీ ఫుటేజీని అక్కడి దుకాణం యజమాని ధర్మేంద్ర పోలీసులకు అందించడంతో వారు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న జాకీని గుర్తించేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి, అతడిని అరెస్టు ఎట్టకేలకు చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే కుక్క నిరంతరం మొరగడం వల్ల తాను విసుగు చెందానని, అందుకే ఆ వీధి కుక్కను చంపాలని నిర్ణయించుకున్నానని జాకీ పోలీసులకు చెప్పినట్లు అధికారులు వివరించారు.