కాషాయ రంగులో కనువిందు : వరుసగా 500 బస్సులు

కాషాయ రంగులో కనువిందు : వరుసగా 500 బస్సులు

లక్నో : ఒకటి కాదు రెండు కాదు 500 బస్సులు లైనుగా ఒకేసారి రోడ్డెక్కాయి. అన్నీ కాషాయ రంగుతో కనువిందు చేశాయి. ఈ అరుదైన దృశ్యం ప్రయాగ్ రాజ్ లో కనిపించింది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గిన్నీస్‌బుక్‌ వరల్డ్‌ రికార్డ్‌ కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. కంట్రీస్‌ లాంగెస్ట్‌ బస్‌ పరేడ్‌ ను గురువారం ఉదయం.. ప్రయాగ్‌రాజ్‌ లో నిర్వహించింది. నవాబ్‌గంజ్‌-సోరాన్‌ మార్గంలో 3.2 కిలోమీటర్ల మేర కాషాయ రంగుతో కూడిన 500 బస్సులను కుంభమేళా లోగోతో పరేడ్‌ గా కొలువు దీర్చింది. మొత్తం 18 డివిజన్ల నుంచి బస్సులు, సిబ్బంది ఈ పరేడ్‌ లో పాల్గొన్నారు. 10 నుంచి 12 మీటర్ల డిస్టెన్స్ లో గంటకు 15 కిలోమీర్ల వేగంతో బస్సులు పరేడ్‌ లో పాల్గొన్నాయి.

ఈ డ్రైవ్ తో UPSRTC, ప్రయాగ్‌ రాజ్‌ ప్రపంచపటంపై నిలుస్తాయని ప్రయాగ్‌ రాజ్‌ డివిజన్‌ రీజినల్‌ సర్వీస్‌ మేనేజర్‌ ఎస్పీ సింగ్‌ తెలిపారు. గతంలో ఈ రికార్డు యూనైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ పేరుమీదుగా ఉంది. UPSRTC చేపట్టిన ఈ ఫ్లీట్‌ ను గిన్నీస్‌ బుక్‌ వరల్డ్‌ రికార్డ్స్‌కు చెందిన 70 మంది పరిశీలకులు గమనిస్తున్నారు.