
వికారాబాద్, వెలుగు: వికారాబాద్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఉర్దూ మీడియంలో బోధించుటకు చరిత్ర, అర్థశాస్త్రం, రాజనీతి శాస్త్రం విభాగంలో లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ గీత లక్ష్మీపట్నాయక్ శనివారం ప్రకటించారు. ఈ నెల 9న సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు. పీహెచ్ డీ, నెట్, సెట్, సంబంధిత పీజీ సబ్జెక్టులో 55 శాతం మార్కులు వచ్చిన వారు అర్హులన్నారు. ఈ నెల 10న కాలేజీలోనే ఇంటర్వ్యూ నిర్వహిస్తామని తెలిపారు.