హైదరాబాద్: రామగుండం ఎరువుల కర్మాగారంలో యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్లాంట్లో ఉత్పత్తి పెంచడంతో సాంకేతిక లోపం తలెత్తినట్లు సమాచారం. ప్లాంట్లో తలెత్తిన సమస్యను పరిష్కరించేందుకు మరో 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అప్పటి వరకూ యూరియా ఉత్పత్తికి ఆటంకం ఏర్పడనుంది. ప్లాంట్ షట్డౌన్ సమాచారాన్ని అధికారులు అధికారికంగా వెల్లడించలేదు.
►ALSO READ | పొలిటికల్ లీడర్స్ మస్త్ ఖుషీ: భారీగా పెరగనున్న అసెంబ్లీ, ఎంపీ సీట్లు..?
