అవసరమైతే లాక్‌‌డౌన్‌కు వెనుకాడొద్దు: సుప్రీం

అవసరమైతే లాక్‌‌డౌన్‌కు  వెనుకాడొద్దు: సుప్రీం

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయని సుప్రీం కోర్టు తెలిపింది. వైరస్ నియంత్రణకు అవసరమైతే లాక్‌డౌన్ పెట్టడానికి వెనుకాడొద్దని కేంద్ర, రాష్ట్రాలకు సూచించింది. కరోనా సెకండ్ వేవ్‌‌ను నియంత్రించడానికి ఇది కీలకమని అభిప్రాయపడింది. ‘దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఎక్కువగా ఉంది. వైరస్ వ్యాప్తి, పెరుగుతున్న పాజిటివ్ కేసులను దృష్టిలో ఉంచుకొని మహమ్మారి నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపుతున్నాం. వీటిని ప్రభుత్వాలు తప్పక పాటించాలి. అదే సమయంలో స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్‌‌లకు కొన్ని సూచనలూ చేస్తున్నాం. ప్రజలు గుంపులుగా, సమూహాలుగా ఎక్కడా గుమికూడకుండా చూడాలి. అలాగే సూపర్ స్ప్రెడర్‌లుగా మారే అవకాశాలు ఉన్న ఈవెంట్లు, కార్యక్రమాలను రద్దు చేయాలి. ప్రజా ప్రయోజనాలు, జనాల ఆరోగ్యం దృష్ట్యా సెకండ్ వేవ్ నియంత్రణకు లాక్‌డౌన్ అంశాన్ని కూడా పరిశీలించాలి. అయితే అట్టడుగు వర్గాలపై లాక్‌డౌన్ ప్రభావం ఎక్కువగా పడుతుంది. కాబట్టి ఆయా వర్గాల అవసరాలను తీరుస్తూ లాక్‌‌డౌన్ పెడితే బాగుంటుంది’ అని సుప్రీం సూచించింది.