ఊర్మిళకు టిక్కెట్ కన్ఫామ్ అయింది

ఊర్మిళకు టిక్కెట్ కన్ఫామ్ అయింది

ప్రముఖ బాలీవుడ్ నటి ఊర్మిళ మతోంద్కర్ కు కాంగ్రెస్ పార్టీ లోక్ సభ టికెట్ ఇచ్చింది. అధిష్టానం ఆమెకు ముంబై నార్త్ లోక్ సభ సీటును కన్ఫామ్ చేసింది. ఈ స్థానం నుంచి బీజేపీ తరపున సిట్టింగ్ ఎంపీ గోపాల్ శెట్టి పోటి చేయబోతున్నారు. దీంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ఆమె గోపాల్ శెట్టికి ప్రత్యర్ధిగా పోటీ చేయనున్నారు.కాగా బుధవారం ఆమె రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరారు. ద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా పోటీ చేయడమే తన లక్ష్యంగా, ఎన్నికల బరిలోకి దిగుతున్నానని ఆమె ఈ సందర్భంగా అన్నారు.