Urvashi Rautela: ఊర్వశి.. నువ్వు తోపు.. బర్త్‌డే కోసం ఏకంగా బంగారపు కేక్

Urvashi Rautela: ఊర్వశి.. నువ్వు తోపు.. బర్త్‌డే కోసం ఏకంగా బంగారపు కేక్

ఊర్వశీ రౌతేలా(Urvashi Rautela).. ఈ పేరు వినగానే తెలుగు ఆడియన్స్ కు ఈ మధ్య టాలీవుడ్ వచ్చిన సూపర్ హిట్ ఐటెం సాంగ్స్ గుర్తొస్తాయి. అవును.. టాలీవుడ్ లో ఆమె చేసిన ఐటెం సాంగ్స్ అన్నీ సూపర్ హిట్. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన వాల్తేరు వీరయ్యలోని వేర్ ఈజ్ ది పార్టీ సాంగ్ గుర్తుంది కదా. ఆ పాటలో మెగాస్టార్ పక్కన గ్లామర్ వలకబోసింది ఈ బ్యూటీనే. అంతేకాదు బ్రో సినిమాలో పవన్ పక్కన, స్కంద సినిమాలో రామ్ పక్కన కూడా చిందేసింది ఈ బ్యూటీ. 

ఇలా సూపర్ హిట్ ఐటెం సాంగ్స్ తో ట్రెండ్ అయ్యే ఊర్వశీ తాజాగా మరోసారి సోషల్ మీడియా వైరల్ అవుతోంది. అయితే ఈసారి మాత్రం ఐటెం సాంగ్ తో కాదు. ఫిబ్రవరి 25 ఊర్వశీ రౌతేలా పుట్టినరోజు. ఈ సందర్బంగా ఆమె ఏకంగా బంగారపు కేక్ కట్ చేశారు. బాలీవుడ్ ప్రముఖ పాప్ సింగర్ యోయో హనీ సింగ్ తో కలిసి కేక్ కట్ చేసింది ఊర్వశీ. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయంపై కొంతమంది నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తుంటే.. మరికొందరేమోనెగిటీవ్ కామెంట్స్ చేస్తున్నారు. బర్త్ డేకి బంగారపు కేక్ కట్టింగా.. నువ్వు తోపు ఊర్వశీ అని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరేమో తినే కేక్ పై బంగారు కోటింగ్ అవసరమా అంత ఓవరాక్షన్ అంటున్నారు. మరి బంగారు కేక్ కట్ చేయడంపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ చేయండి.