Urvashi Rautela: హీరోయిన్లను అవమానిస్తూ AI ఫోటో.. ఐశ్వర్య రాయ్, పీసీ కాళ్ల దగ్గర మోకరిల్లిన ఊర్వశి.. బ్యూటీ ఆగ్రహం!

Urvashi Rautela: హీరోయిన్లను అవమానిస్తూ AI ఫోటో.. ఐశ్వర్య రాయ్, పీసీ కాళ్ల దగ్గర మోకరిల్లిన ఊర్వశి.. బ్యూటీ ఆగ్రహం!

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేల (Urvashi Rautela) తెలుగు ఆడియన్స్కి పరిచయం అక్కర్లేని పేరు. బాలయ్యతో ‘డబిడి దిబిడి’, చిరంజీవితో ‘వేర్ ఈజ్ ది పార్టీ’, పవన్ పక్కన బ్రో సినిమాలో, రామ్ పక్కన స్కంద.. ఇలా వరుసగా తెలుగు సాంగ్స్ చేసి స్టార్ ఐటెం బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఎప్పటికప్పుడు ఇంస్టాగ్రామ్ లో కొత్త ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారుకి బాగా దగ్గరైంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఊర్వశికి సంబంధించిన ఓ ఏఐ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఫ్యాన్‌మేడ్ ఏఐ జనరేటెడ్తో డిజైన్ చేసిన ఆ ఫోటోలో ఐశ్వర్య రాయ్ బచ్చన్, ప్రియాంక చోప్రా, మాధురీ దీక్షిత్, దీపికా పదుకొనే వంటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్లను గ్లోబల్ స్టార్‌డమ్ ర్యాంక్ చేసినట్లు చూపించారు. అందులో ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రాల కాళ్ళ కిందా ఊర్వశి సలాం పెడుతున్నటుగా ఫోటో క్రియేట్ చేశారు. ఇప్పుడు ఈ వ్యవహారం ఇండస్ట్రీలో హీరోయిన్ల మధ్య పోలికలపై మరోసారి చర్చకు దారితీసింది.

ఊర్వశి రౌతేలా ఫైర్..

ఫ్యాన్స్ రూపొందించిన ఆ ఏఐ ఫోటోలో ఐశ్వర్య రాయ్ అగ్రస్థానంలో సింహాసనంపై కూర్చుంది. ప్రియాంక చోప్రా మరో సింహాసనంపై కనిపించారు. ఇక పీసీకి ఇరువైపులా దీపికా పదుకొణె, మాధురీ దీక్షిత్ నిల్చున్నారు. ఆ కింది వరుసలో ప్రస్తుత స్టార్ హీరోయిన్లు అలియా భట్, కత్రినా కైఫ్, కరీనా కపూర్లతో పాటు ఊర్వశి రౌటెలా ఉన్నారు. ఇదంతా ఒకటైతే.. ఐశ్వర్య, పీసీ, దీపికా, మాధురీ దీక్షిత్ల.. కాళ్ల దగ్గర మోకాళ్లపై వంగి ఊర్వశి మొక్కుతున్నట్లు చూపించడంతో ఈ ఫోటో తీవ్ర చర్చకు దారితీసింది.ఉంది. ఆ వెంటనే హర్ట్ అయిన ఊర్వశి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. 

“ప్రతి నటికి తనదైన సొంత ప్రయాణం, కృషి, గమ్యం ఉంటాయి. మహిళలను పోల్చడం లేదా ఫ్యాన్ వార్స్ సృష్టించడం సమాజంలో నెగిటివిటీని మాత్రమే పెంచుతుంది. టాలెంట్, ఎదుగుదల, మానవత్వాన్ని సెలబ్రేట్ చేద్దాం. దయచేసి ఈ విషపూరిత సంస్కృతిని ఆపండి” అంటూ ఊర్వశి గట్టిగా బుద్ది చెప్పింది. 

ఊర్వశి లుక్స్ హాట్ టాపిక్..

వరుసగా ఐదోసారి కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో పాల్గొన్న ఊర్వశి ఈ ఏడాది కూడా తన గ్లామరస్ లుక్స్‌తో హాట్ టాపిక్‌గా మారారు. ఈ వేడుకలో ఊర్వశి ధరించిన డిజైనర్ అవుట్‌ఫిట్స్ భారీ చర్చకు దారితీశాయి. ముఖ్యంగా జోలిపోలి కోచర్ రూపొందించిన క్రిస్టల్స్‌తో మెరిసే ప్రత్యేక గౌన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ గౌన్ ధర సుమారు 155.87 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.1500 కోట్లు) అని ప్రచారం జరిగింది.

ఊర్వశి అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్..

ప్రస్తుతం ఊర్వశి కెరీర్ పరంగా కూడా బిజీగా ఉన్నారు. ఇటీవల ఇన్‌స్పెక్టర్ అవినాష్ సీజన్ 2లో నటించింది. హీరో రణదీప్ హుడాతో కలిసి నటించిన ఊర్వశి ప్రశంసలు అందుకున్నారు. త్వరలో అక్షయ్ కుమార్తో  Welcome to the Jungleలో నటిస్తుంది. అలాగే ‘బ్లాక్ రోజ్’, ‘కసూర్ 2’ సినిమాలు కూడా ఊర్వశి లైనప్‌లో ఉన్నాయి. అంతేకాక అంతర్జాతీయ పాప్ స్టార్ జాసన్ డెరులోతో కలిసి ఓ మ్యూజిక్ ప్రాజెక్ట్ కూడా ప్రకటించింది