Urvashi Rautela Cannes 2024: ఊర్వశీ రౌతేలా..టాక్ ఆఫ్ ది వరల్డ్..కేన్స్ రెడ్ కార్పెట్ పై ధరించిన డ్రెస్సెస్ ధర రూ.105 కోట్లు!

Urvashi Rautela Cannes 2024: ఊర్వశీ రౌతేలా..టాక్ ఆఫ్ ది వరల్డ్..కేన్స్ రెడ్ కార్పెట్ పై ధరించిన డ్రెస్సెస్ ధర రూ.105 కోట్లు!

ఊర్వశీ రౌతేలా(Urvashi Rautela)..ప్రస్తుతం 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో తన సొగసైన అందంతో..ఖరీదైన డ్రస్సులలో మెరిసి టాక్ ఆఫ్ ది వరల్డ్ గా మారింది. ఈ బ్యూటీ కేన్స్ వేదికపై ధరించిన డ్రెస్ అందరి దృష్టిని ఆకర్షించింది.అయితే, ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ పై మెరిసి అందరినీ అబ్బురపరిచింది.

ఊర్వశీ ఫస్ట్ డే ధరించిన ఓ పింక్ గౌన్ హాట్ అండ్ హీట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే, ఆ గౌను ధర రూ.47 కోట్లు అని సమాచారం. అలాగే, కేన్స్ నాలుగవ రోజు వేసుకున్న బ్లాక్ అండ్ వైట్ కస్టమ్ మేడ్ డ్రెస్ ధర ఏకంగా రూ.58 కోట్లు అని టాక్ వినిపిస్తోంది. దీన్ని బట్టి చూసుకుంటే..ఈ రెండు డ్రెస్సులు కలిపి రూ.105 కోట్లు వరకు ఉంటుందని అంచనా.

వేసుకుని..పక్కన పెట్టే రెండు డ్రెస్సుల విలువే ఇంత ఉంటే..తన డైలీ యూసెస్..తన అందానికి మెంటెనెన్స్..ఇల్లు,కార్లు, బంగ్లాలు చూస్కుంటే ఎన్ని కోట్లకి ఉంటుందో అని నెటిజన్స్ షాక్..అవాక్క్ అవుతున్నారు. ప్రస్తుతం ఊర్వశీ రౌతేలా డ్రెస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ ఏడాది 2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మాజీ మిస్  ఐశ్వర్య రాయ్ తో పాటు హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్, కియారా అద్వానీ, అదితి రావ్ హైదరీ, శోభితా ధూళిపాళ్ల, ప్రీతి జింటా వంటి బాలీవుడ్ అందాలు మెరిశారు. అయితే వీరందరి కన్నా ఊర్వశి రౌతేలా ప్రత్యేకంగా ధరించిన డ్రెస్సెస్..లుక్స్ హైలెట్ గా నిలిచింది.

ప్రస్తుతం ఊర్వశీ రౌతేలా తెలుగులో బాలయ్య బాబు NBK 109 లో నటిస్తుంది. ఇక ఈ మధ్య తెలుగులో స్టార్ హీరోస్ తో చేసిన ఐటెం సాంగ్స్ యూట్యూబ్ లో ట్రెండ్ సెట్ చేశాయి.