ఊర్వశివో రాక్షసివో మూవీ విశేషాలు

ఊర్వశివో రాక్షసివో మూవీ విశేషాలు

శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా రాకేష్ శశి రూపొందించిన చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, ఎం.విజయ్ నిర్మించారు. తమిళ హిట్ మూవీ ‘ప్యార్ ప్రేమ కాదల్’కి రీమేక్‌‌‌‌గా వచ్చిన ఈ మూవీ శుక్రవారం విడుదలై సక్సెస్ సాధించింది. ఈ సందర్భంగా అల్లు శిరీష్ చెప్పిన విశేషాలు.

‘చాలా రోజుల తర్వాత హిట్ టాక్ రావడంతో రిలీఫ్‌‌‌‌గా ఫీలవుతున్నా. శ్రీకుమార్‌‌‌‌‌‌‌‌గా ప్రేక్షకులు నన్ను ఆదరించారు. రియల్ లైఫ్‌‌‌‌లో నా కజిన్‌‌‌‌ను ఎగ్జాంపుల్‌‌‌‌గా తీసుకుని నా క్యారెక్టర్ డిజైన్ చేశాం. రీమేక్ అయినా అరవింద్ గారికి కథ బాగా నచ్చడంతో నేను కూడా ఎక్సయిట్ అయ్యాను. రాకేష్ పరిచయంతో తనను డైరెక్ట్ చేయమని అడిగాం. థీమ్‌‌‌‌ను మార్చకుండా స్ర్కీన్‌‌‌‌ప్లేలో కొన్ని మార్పులు చేశాం. హిలేరియస్‌‌‌‌గా వర్కవుట్ అయ్యింది. ‘ప్రేమ కాదంట’ అనే టైటిల్‌‌‌‌ను ముందు అనుకున్నా, అందరికీ రీచ్ అవడం లేదని భావించి ‘ఊర్వశివో రాక్షసివో’ టైటిల్ ఫిక్స్ చేశాం. అను ఇమ్మాన్యుయేల్‌‌‌‌తో పరిచయం పెరగడంతో మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. రొమాన్స్ ఉంది తప్ప.. ఎక్కడా ఇబ్బందికరంగా ఉండదు. మదర్ సెంటిమెంట్‌‌‌‌తో డ్రామా పండిస్తే రొటీన్ ఫ్యామిలీ డ్రామా అనుకుంటారని, ఫ్రెష్‌‌‌‌గా ఉండేలా చూశాం. పెళ్లి అనేది హిట్‌‌‌‌ సినిమాలా అన్ని అనుకూలించాలి (నవ్వుతూ). పెళ్లిపై ఇంట్లో నన్నెప్పుడూ ప్రెషర్ పెట్టలేదు.   నేను కాస్త స్లో. సినిమా సినిమాకి గ్యాప్ ఎక్కువ తీసుకుంటుంటాను. ప్రస్తుతానికైతే ఏ మూవీకి కమిట్ అవ్వలేదు. రెండు స్ర్కిప్టులు విన్నాను. త్వరలోనే అనౌన్స్ చేస్తా’.