కోల్‌కతా: ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న హైదరాబాద్.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బోణీ చేసింది. బౌలింగ్‌లో చామ మిలింద్ (3/34), బ్యాటింగ్‌లో రాహుల్ బుద్ది (59 నాటౌట్) రాణించడంతో.. బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో మధ్యప్రదేశ్‌పై గెలిచింది. టాస్ గెలిచిన మధ్యప్రదేశ్ 20 ఓవర్లలో 144/9 స్కోరు చేసింది. శివాంగ్ కుమార్ (45), హర్ష్ గవ్లి (21), రాహుల్ బాథమ్ (19) రాణించారు. రక్షణ్ రెడ్డి, అర్ఫాజ్ అహ్మద్ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత హైదరాబాద్ 18.1 ఓవర్లలో 145/5 స్కోరు చేసి నెగ్గింది. తన్మయ్ అగర్వాల్ (14), అమన్ రావు (16), తనయ్ త్యాగరాజన్ (18), అర్ఫాజ్ అహ్మద్ (18 నాటౌట్) మోస్తరుగా ఆడినా ప్రజ్ఞయ్ రెడ్డి (9), భవేశ్ సేత్ (9) నిరాశపర్చారు. త్రిపురేష్ సింగ్ 2 వికెట్లు తీశాడు. రాహుల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. తాజా విజయంతో హైదరాబాద్‌కు 4 పాయింట్లు లభించాయి.
