కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తుండటంతో విమాన ప్రయాణాలపై అమెరికా విమానయాన సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇకపై మాస్క్ ధరించని ప్రయాణికులను‘నో ఫ్లై’ జాబితాలోకి చేర్చాలని నిర్ణయించాయి. ఈ విషయాన్ని అలస్కా ఎయిర్‌లైన్స్, అమెరికన్ ఎయిర్‌లైన్స్, డెల్టా ఎయిర్ లైన్స్, హవాయిన్ ఎయిర్‌లైన్స్, జెట్ బ్లూ ఎయిర్‌వేస్, సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్ లు తెలిపాయి. ఈ విషయంలో కొన్ని సడలింపులు కూడా ఇచ్చాయి. ఆహారం తీసుకునేటప్పుడు, నీళ్లు తాగేటప్పుడు మాత్రం మాస్కులు పూర్తిగా తొలగించుకోవచ్చన్నాయి. విమానం ఎక్కడానికి ముందే ఫేస్ మాస్క్ ధరిస్తామని ప్రయాణికులు హామీ ఇవ్వాల్సి ఉంటుందని ఆయా విమానయాన సంస్థలు తెలిపాయి.

