లాలా జలంతో క‌రోనా టెస్ట్..వేగాన్ని పెంచేందుకే కొత్త ప‌ద్ద‌తి

లాలా జలంతో క‌రోనా టెస్ట్..వేగాన్ని పెంచేందుకే కొత్త ప‌ద్ద‌తి

క‌రోనా వైర‌స్ గుప్పెట్లో అగ్ర‌రాజ్యం అమెరికా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఓ వైపు క‌రోనా వ్యాక్సిన్ లేక‌పోవ‌డం, మ‌రోవైపు వైర‌స్ ప్రారంభం నుంచి అమెరికా నిర్ల‌క్ష్యంతో పాటు త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల క‌రోనా వైర‌స్ కేసులు విప‌రీతంగా పెరిగిపోయాయి.

ప్ర‌స్తుతం అమెరికాలో 5.73మిలియ‌న్ల మందికి వైర‌స్ సోకగా అందులో ల‌క్షా 69వేల‌మంది మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ నేప‌థ్యంలో టెస్ట్ లు చేసి బాధితుల్ని గుర్తించేందుకు కొత్త కొత్త ఐడియాస్ ను ఇంప్లిమెంట్ చేస్తుంది.

వైర‌స్ టెస్ట్ చేసేందుకు స‌మ‌యం ప‌డుతుంది. టెస్ట్ ల పేరుతో సోష‌ల్ డిస్టెన్స్ ను విస్మ‌రిస్తున్న ఘ‌ట‌న‌ల్ని మ‌నం చూసే ఉంటాం. తాజాగా వాటికి చెక్ పెడుతూ లాలాజ‌లంతో క‌రోనా టెస్ట్ లు చేసేందుకు ట్రంప్ అనుమితి ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.

లాలాజ‌లంతో టెస్ట్ లు చేయ‌డం చాలా ఈజీ అవుతుంద‌ని,త‌క్కువ‌ వ్య‌వ‌ధిలో ఎక్కువ‌మందికి టెస్ట్ లు చేయోచ్చ‌ని ఫుడ్ అండ్ డ్ర‌గ్ అడ్మినిస్ట్రేష‌న్ క‌మిష‌న‌ర్ స్టీఫెన్ తెలిపారు. ఈ త‌ర‌హాలో టెస్ట్ ల వల్ల వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్ట‌వ‌చ్చ‌ని అన్నారు.

గ‌తంలో లాలాజ‌లంతో టెస్ట్ లు చేస్తే ఎలా ఉంటుందో అనే అంశంపై సైంటిస్ట్ లు ప‌రిశోధ‌న‌లు జ‌రిపారు. ఈ ప‌రిశోధ‌న‌ల్లో ఫ‌లితాలు ఆశాజ‌న‌కంగా లేవ‌ని స‌మాచారం. అయినా సరే లాలాజ‌లంతో క‌రోనా టెస్ట్ చేసేందుకు అనుమ‌తి ఇవ్వ‌డం కొంచెం ఆందోళ‌న క‌రంగా ఉంద‌నే అభిప్రాయాలు వ్య‌క్తమ‌వుతున్నాయి.

నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్‌బిఎ) ఆటగాళ్ళు మరియు సిబ్బందికి లాలాజ‌లం ద్వారా క‌రోనా టెస్ట్ ల్ని నిర్వహించ‌డంతో ఈ కొత్త ప‌ద్ద‌తికి శ్రీకారం చుట్టిన‌ట్ల‌వుతుంది.