కరోనా ఎఫెక్ట్: అమెరికాకు వెళ్లడానికి వీరికే అనుమతి

కరోనా ఎఫెక్ట్: అమెరికాకు వెళ్లడానికి వీరికే అనుమతి

అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ ప్రకటించిన ఆంక్షల నుంచి భారత్‌కు చెందిన కొన్ని వర్గాల విద్యార్థులు, విద్యావేత్తలు, జర్నలిస్టులు మరియు వ్యక్తులకు మినహాయింపు ఇస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.

భారత్ నుంచి అమెరికా వచ్చే ప్రయాణికులకు ఆ దేశ అధ్యక్షుడు జో బిడెన్ కొత్త ఆంక్షలను విధించారు. ఇండియాలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. భారత్‌లో 14 రోజుల ఉన్నవాళ్లకు అమెరికాలోకి ప్రవేశం లేదని జో బిడెన్ తెలిపారు. అయితే ఆ నిర్ణయంలో కొన్ని మార్పులు చేస్తున్నట్లు అమెరికా వదేశాంగ శాఖ ప్రకటించింది. విద్యార్థులు, జర్నలిస్టులు, విద్యావేత్తలు మరియు సింగిల్‌గా వచ్చే వ్యక్తులకు మినహాయింపు ఇస్తున్నట్లు ఆ శాఖ కార్యదర్శి టోని బ్లింకెన్ ప్రకటించారు.

యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రకారం.. బ్రెజిల్, చైనా, ఇరాన్, మరియు దక్షిణాఫ్రికా నుంచి కొన్ని వర్గాల ప్రయాణికులకు అమెరికన్ ప్రభుత్వం మినహాయింపులను ఇచ్చింది. అవే మినహాయింపులను భారత్‌కు కూడా ఇస్తున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు. ఆగష్టులో విద్యా సంవత్సరం ప్రారంభం కానున్నందున విద్యార్థులు 30 రోజుల ముందుగానే అమెరికాకు రావొచ్చని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా  నమోదవుతున్న కరోనా కేసుల్లో మూడింట ఒక వంతు కేసులు ఇండియాలోనే నమోదవుతున్నట్లు అమెరికా పేర్కొంది.