హైదరాబాద్​లో వర్క్‌‌‌‌ఫ్యూజన్

హైదరాబాద్​లో వర్క్‌‌‌‌ఫ్యూజన్

హైదరాబాద్, వెలుగు: అమెరికా కేంద్రంగా పనిచేసే ప్రొడక్ట్​ డెవెలప్​మెంట్​​ కంపెనీ వర్క్‌‌‌‌ఫ్యూజన్ హైదరాబాద్​లో తన ఆఫీసును ప్రారంభించింది. హైటెక్ సిటీలోని అరబిందో ఫెసిలిటీలోని ఈ ఆఫీసులో 200 మంది పనిచేయవచ్చు. రాష్ట్ర ఐటీ & ఇండస్ట్రీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ  జయేష్ రంజన్ ఈ కార్యక్రమానికి చీఫ్​ గెస్టుగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘15 సంవత్సరాల క్రితం అనేక ఇంటర్నేషనల్​ కంపెనీలు హైదరాబాద్‌‌లో తమ కార్యకలాపాలను మొదలుపెట్టాయి. వాటికి సిటీపై నమ్మకం ఏర్పడింది. పెట్టుబడులను మరింత పెంచాయి. హైదరాబాద్‌‌లో బీఎఫ్​ఎస్​ఐ(బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్  ఇన్సూరెన్స్) సెక్టార్​ బిజినెస్​ భారీగా పెరిగింది.

ప్రభుత్వ సానుకూల విధానాలు, పెరుగుతున్న మౌలిక సదుపాయాలు, ట్యాలెంట్​ దొరకడం వల్ల హైదరాబాద్​ గ్లోబల్​ కంపెనీలను ఆకర్షిస్తోంది.  తెలంగాణ ప్రభుత్వం ఐటీలో స్థిరమైన వృద్ధిని సాధిస్తోంది. బీఎఫ్​ఎస్​ఐ కన్సార్టియం, టాస్క్‌‌ స్కిల్ డెవలప్‌‌మెంట్ & ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇనీషియేటివ్‌‌లతోనూ వర్క్​ఫ్యూజన్​ కలసి పనిచేయాలి” అని ఆయన సూచించారు.  వివిధ విభాగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌‌ను ప్రారంభించేందుకు నాస్కామ్‌‌తో కలిసి తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన కొత్త సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌‌తోనూ వర్క్‌‌ఫ్యూజన్ భాగస్వామ్యం ఏర్పరుచుకోవాలని  జయేష్ అన్నారు.