అమెరికాలో అందుబాటులోకి మరో వ్యాక్సిన్

అమెరికాలో అందుబాటులోకి మరో వ్యాక్సిన్

కరోనావైరస్‌కు విరుగుడుగా అమెరికాలో మరో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందని యూఎస్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. కరోనాను ఎదుర్కొనేందుకు మోడెర్నా వ్యాక్సిన్ అవైలబుల్‌గా ఉందని ఆయన ప్రకటించారు. ఇటీవలే ఫైజర్ వ్యాక్సిన్‌కు అనుమతులిచ్చి అందుబాటులోకి తీసుకొచ్చిన అమెరికా సర్కారు.. ఇప్పుడు తాజాగా మోడెర్నాకు అనుమతులిచ్చింది. మోడెర్నాను ఎమర్జెన్సీ అవసరాల కింద వాడుకోవడానికి యునైటెడ్ స్టేట్స్ ఫుడ్, డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి ఇచ్చింది. ఇప్పటికే ఫైజర్ టీకాను అమెరికాలోని పలుదేశాల్లో ప్రజలకు ఇస్తున్నారు.

ఈ నెలాఖరుకల్లా అమెరికాలో 2 కోట్ల డోసులు పంపిణీ చేస్తామని మోడెర్నా తెలిపింది. వచ్చే ఏడాది ఫస్ట్ క్వార్టర్‌లో ప్రపంచవ్యాప్తంగా పది నుంచి పన్నెండున్నర కోట్ల డోసులు పంపిణీ చేయనున్నట్లు మోడెర్నా తెలిపింది. ఇందులో దాదాపు 9 కోట్ల డోసులు అమెరికాలోనే డిస్ట్రిబ్యూట్ చేస్తామని తెలిపింది.

అమెరికాలో ఇప్పటివరకు కోటి 78 లక్షలమంది కరోనా బారినపడ్డారు. వారిలో 3 లక్షల 20 వేల మంది చనిపోయారు. అమెరికా ప్రజల ప్రాణాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం ప్రయారిటీతో పనిచేసిందని అక్కడి ప్రభుత్వం తెలిపింది. కరోనా నుంచి ప్రజలను రక్షించడానికి భద్రత, రక్షణ ప్రమాణాలున్న వ్యాక్సిన్లను వేగంగా అందుబాటులోకి తెచ్చామని చెప్పింది. 18 ఏళ్లకు పైబడిన వారికి ఈ వ్యాక్సిన్లు ముందుగా ఇస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అమెరికాలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ అత్యంత వేగంగా జరుగుతోందని.. ఇది మెడికల్ మిరాకిల్ అని అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ అన్నారు.

అమెరికా నుంచి కరోనా మహమ్మారిని తరిమే ప్రయత్నం యుద్ధ ప్రాతిపదికన జరుగుతోందని ఆ దేశ ఆరోగ్య, మానవ సేవల శాఖ సెక్రటరీ అలెక్స్ అజర్ అన్నారు. ఫ్రంట్ లైన్ వర్కర్లతో పాటు అమెరికన్లందరికీ టీకా ఇస్తున్నామని ఆయన చెప్పారు. కరోనా నుంచి శాశ్వత రక్షణ కల్పించడంతో పాటు పాండెమిక్‌ను అంతం చేయడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు.

For More News..

నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్ నిలిపివేత

పెళ్లింట్లో భారీ చోరీ.. 210 తులాల నగలు మాయం

సంగమేశ్వరం పూర్తయితే శ్రీశైలం ప్రాజెక్టు ఎండిపోతది