డిపెండెంట్‌ వీసా వర్క్ ఆథరైజేషన్‌ కేసుకు పరిష్కారం

డిపెండెంట్‌ వీసా వర్క్ ఆథరైజేషన్‌ కేసుకు పరిష్కారం
  • ఆటోమెటిక్ వర్క్ ఆథరైజేషన్​కు సర్కారు ఓకే
  • వర్క్​ పర్మిట్​ కోసం ఎదురుచూడక్కర్లే
  • గతంలో నిషేధం.. కోర్టుకెక్కిన వీసా హోల్డర్లు
  • కోర్టు బయటే ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం

వాషింగ్టన్: అమెరికాలో హెచ్​ 4 వీసాపై ఉన్నవాళ్లకు ఎంతగానో ఉపయోగపడే నిర్ణయం వెలువడింది. వర్క్​ఆథరైజేషన్​కు సంబంధించిన కోర్టు కేసును బయటే సెటిల్​ చేసుకునేందుకు అమెరికా హోమ్​ల్యాండ్​ సెక్యూరిటీ డిపార్ట్​మెంట్​ ఒప్పుకుంది. ఈమేరకు అగ్రిమెంట్​ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా హెచ్​1 బీ వీసా హోల్డర్ల స్పౌజ్(భార్య/భర్త)కు.. అంటే, హెచ్​4 వీసాపై ఉన్నవాళ్లకు ఆటోమేటిక్​ వర్క్​ ఆథరైజేషన్​ పర్మిట్లు జారీ చేసేందుకు ఆమోదం లభిస్తుంది. ఈ నిర్ణయంతో అమెరికాలో ఉంటున్న లక్షలాది మంది  భారతీయులకు లాభం కలుగుతుంది. ఇమ్మిగ్రెంట్ స్పౌజ్‌‌‌‌ల తరఫున అమెరికన్ ఇమ్మిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్(ఏఐఎల్‌‌‌‌ఏ) వేసిన పిటిషన్‌‌‌‌ విషయంలో హోమ్‌‌‌‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌‌‌‌మెంట్ ఇలా రాజీకి వచ్చింది. హెచ్1బీ వీసా హోల్డర్ల స్పౌజ్‌‌‌‌ల ఎంప్లాయ్‌‌‌‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ల(ఈఏడీ) అప్లికేషన్లు పెండింగ్‌‌‌‌లో ఉన్నప్పుడు.. వాళ్లు ఆటోమెటిక్‌‌‌‌గా ఆథరైజేషన్ ఎక్స్‌‌‌‌టెన్షన్  పొందకుండా నిషేధిస్తూ యూఎస్ సిటిజన్‌‌‌‌షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్‌‌‌‌సీఐఎస్) తీసుకొచ్చిన పాలసీ ఇప్పుడు మారిపోయింది.

వర్క్ ఆథరైజేషన్ ఇచ్చిన ఒబామా

హెచ్‌‌‌‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు, 21 ఏళ్లలోపు పిల్లలు అమెరికా వెళ్లడానికి వీలుగా హెచ్‌‌‌‌-4 వీసాలు జారీ చేస్తుంటారు. ఈ వీసా హోల్డర్లలో కొన్ని కేటగిరీల వారికి వర్క్ ఆథరైజేషన్ కల్పిస్తూ గతంలో ఒబామా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటిదాకా 90 వేల మందికిపైగా హెచ్4 వీసాదారులకు పని దొరికింది. హెచ్4 వీసా ఉన్నవాళ్లకు.. ఈఏడీ ఆటోమెటిక్ ఎక్స్‌‌‌‌టెన్షన్ కోసం తరచూ రెగ్యులేటరీ టెస్టుకు వెళ్లేవాళ్లు. కానీ ప్రభుత్వం ఈ బెనిఫిట్‌‌‌‌ను నిషేధించింది. రీ ఆథరైజేషన్ కోసం ఎదురుచూసేలా చేసింది. ‘‘ప్రభుత్వ నిర్ణయం వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఎలాంటి చట్టపరమైన కారణం లేకుండానే ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇది వారికే కాదు.. అమెరికా ఆర్థిక రంగానికి కూడా నష్టం కలిగిస్తుంది” అని ఏఐఎల్ఏకి చెందిన జాన్ వస్డన్ అన్నారు. తాజాగా కోర్టు బయటే ఈ విషయాన్ని సెటిల్​ చేసుకోవాలని హోమ్‌‌‌‌ల్యాండ్ సెక్యూరిటీ తీసుకున్న నిర్ణయంపై ఆయన సంతోషం వ్యక్తంచేశారు.

హెచ్​ 4 వీసా అంటే..

హెచ్​1 బీ వీసా హోల్డర్లు వేరే దేశంలో ఉంటున్న తమ దగ్గరి బంధువులను అమెరికా పిలిపించుకోవడానికి ఈ వీసా ఉపయోగపడుతుంది. ఇది డిపెండెంట్​వీసా కావడంతో ఎంప్లాయ్​మెంట్​ ఆథరైజేషన్​ డాక్యుమెంట్(ఈఏడీ) లేకుంటే ఈ వీసా హోల్డర్లు నేరుగా ఉద్యోగం చేయడానికి వీలులేదు.

ఏమిటీ కేసు..

ఒబామా హయాంలో హెచ్​1బీ వీసా హోల్డర్ల స్పౌజ్​లకు వర్క్​ ఆథరైజేషన్​ కల్పించారు. దీనివల్ల హెచ్​4 వీసా హోల్డర్లలో కొంతమందికి ఈఏడీ అప్లికేషన్​ పెండింగ్​లో ఉన్నప్పటికీ ఆటోమేటిక్​ ఎక్స్​టెన్షన్​ వచ్చేది. దీనిని అడ్డుకోవడానికి యూఎస్‌‌‌‌సీఐఎస్ కొత్త పాలసీ తీసుకొచ్చింది. ఈ పాలసీని తప్పుబడుతూ హెచ్​4 వీసా హోల్డర్ల తరఫున అమెరికన్ ఇమ్మిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ కోర్టులో కేసు వేసింది. దీంతో ఇప్పుడు బైడెన్​ సర్కారు రాజీకి వచ్చింది. యూఎన్ సీఐఎస్ తీసుకొచ్చిన పాలసీని వాపస్​ తీసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికాలో హెచ్​1 వీసాపై ఉన్నవాళ్లలో మన భారతీయులే ఎక్కువ. ముఖ్యంగా సాఫ్ట్​వేర్​ కంపెనీల్లో వీరి సంఖ్య చాలా ఎక్కువ. అందులోనూ మన తెలుగువాళ్లదే మెజారిటీ. తాజా నిర్ణయం అమెరికాలో లక్షల సంఖ్యలో ఉన్న తెలుగువాళ్లకు ఎంతో ఉపయోగపడుతుంది.