అమెరికా ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి ఢమాల్

అమెరికా ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి ఢమాల్

న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్‌‌‌‌లో అమెరికా జీడీపీ యాన్యువల్ బేసిస్‌‌లో  0.5 శాతం తగ్గింది.  0.2 శాతం తగ్గుతుందని ఎనలిస్టులు అంచనా వేశారు.  అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రేడ్ వార్ వల్ల ఇంపోర్ట్స్ ఒక్కసారిగా బాగా పెరిగాయి.  దీనివల్ల బిజినెస్‌‌లు గందరగోళంలో పడ్డాయని గురువారం యూఎస్‌‌ కామర్స్ డిపార్ట్‌‌మెంట్ పేర్కొంది.  

ట్రంప్  టారిఫ్‌‌లు వచ్చేలోపు భారీగా దిగుమతులు చేపట్టాలని అమెరికన్ కంపెనీలు చూశాయి. మార్చి క్వార్టర్‌‌‌‌లో  దిగుమతులు ఏడాది లెక్కన  37.9శాతం  పెరిగాయి.  2020 తర్వాత ఇంత వేగంగా పెరగడం  ఇదే మొదటిసారి. గత మూడేళ్లలో మొదటిసారిగా అమెరికా ఆర్థిక వ్యవస్థ క్వార్టర్లీగా పడిపోయింది. 2024 ఆఖరి మూడు నెలల్లో 2.4శాతం వృద్ధి ఉండగా, ఇప్పుడు దానికి రివర్స్ అయ్యింది. వినియోగం కూడా బాగా దెబ్బతింది. గతేడాది మార్చి  క్వార్టర్‌‌లో 4శాతం పెరిగిన వినియోగం, ఈ ఏడాది మార్చి క్వార్టర్‌‌‌‌లో కేవలం 0.5 శాతం గ్రోత్‌‌ మాత్రమే నమోదు చేసింది.