అమెరికాలో పిల్లలకు ఫైజర్ టీకాల పంపిణీ

 అమెరికాలో పిల్లలకు ఫైజర్ టీకాల పంపిణీ

కరోనా కట్టడిలో మరో ముందడుగు పడింది. ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్ పిల్లలకు అందుబాటులోకి వచ్చింది. అమెరికాలో చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ పంపిణీకి అనుమతినిచ్చింది. దీంతో 5 నుండి 11 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలకు ఫైజర్ టీకాలను పంపిణీ చేస్తున్నారు. కాలిఫోర్నియా, న్యూయార్క్ సహా అనేక రాష్ట్రాలు చిన్నారులకు టీకాలను అందిస్తున్నాయి. పిల్లలకు టీకా అందుబాటులోకి రావడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వ్యాక్సిన్ సెంటర్లకు బారులు తీరారు.