చిప్​ సప్లయ్‌‌ చెయిన్​పై  అమెరికా, ఇండియా ఒప్పందం

చిప్​ సప్లయ్‌‌ చెయిన్​పై  అమెరికా, ఇండియా ఒప్పందం

న్యూఢిల్లీ: సెమీ కండక్టర్​ సప్లయ్‌‌ చెయిన్​, ఇన్నోవేషన్​లలో పార్ట్​నర్​షిప్​ కోసం ఇండియా, అమెరికాలు ఎంఓయూ కుదుర్చుకున్నాయి. కేంద్ర కామర్స్​, ఇండస్ట్రీస్‌‌ శాఖల మంత్రి పీయుష్​గోయల్​ఆహ్వానం మేరకు అమెరికా కామర్స్​మంత్రి జినా రైమండో ఈ నెల 7–10 తేదీల్లో ఇండియాలో పర్యటించారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులకు అవకాశాల గురించి చర్చ జరిగింది. ఇండియా– యూఎస్​ కమర్షియల్​ డైలాగ్​లో భాగంగా ఈ ఎంఓయూపై సంతకాలు జరిగాయి. సెమీకండక్టర్​ సప్లయ్‌‌ చెయిన్ సమస్యలను పరిష్కరించడానికి సాయం చేసుకోవడానికి ఈ ఒప్పందం సాయపడుతుంది.  సెమీ కండక్టర్​ ఇన్నోవేషన్​ ఎకోసిస్టమ్​ను అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఇరు దేశాలకు ఉపయోగపడేలా ఆర్​ అండ్​ డీ, ట్యాలెంట్​, స్కిల్ ​డెవెలప్​మెంట్​పై ఫోకస్​ చేస్తారు.