నేటి నుంచి యూఎస్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌..24వ గ్రాండ్​స్లామ్​పై జకో గురి

నేటి నుంచి యూఎస్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌..24వ గ్రాండ్​స్లామ్​పై జకో గురి

న్యూయార్క్: సీజన్‌‌‌‌‌‌‌‌ చివరి గ్రాండ్‌‌‌‌‌‌‌‌స్లామ్‌‌‌‌‌‌‌‌ యూఎస్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌ మెగా టోర్నీకి రంగం సిద్ధమైంది. రెండేండ్ల గ్యాప్‌‌‌‌‌‌‌‌ తర్వాత ఈ టోర్నీ బరిలోకి దిగుతున్న సెర్బియా టెన్నిస్​ లెజెండ్‌‌‌‌‌‌‌‌ నొవాక్‌‌‌‌‌‌‌‌ జొకోవిచ్‌‌‌‌‌‌‌‌ తనను ఊరిస్తున్న  24వ గ్రాండ్‌‌‌‌‌‌‌‌స్లామ్‌‌‌‌‌‌‌‌పై గురి పెట్టాడు. సోమవారం మొదలయ్యే ఈ టోర్నీ మెన్స్​ సింగిల్స్​లో రెండో సీడ్​గా టైటిల్​ ఫేవరెట్​గా బరిలోకి దిగుతున్నాడు. 

20 ఏండ్ల  కార్లోస్‌‌‌‌‌‌‌‌ అల్కరాజ్  డిఫెండింగ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌గా టాప్‌‌‌‌‌‌‌‌ సీడ్‌‌‌‌‌‌‌‌గా  బరిలోకి దిగుతున్నాడు. ఈ నేపథ్యంలో యూఎస్​ ఓపెన్​లోనూ  నొవాక్‌‌‌‌‌‌‌‌–అల్కరాజ్‌‌‌‌‌‌‌‌పైనే అందరి ఫోకస్‌‌‌‌‌‌‌‌ ఉండనుంది.విమెన్స్​ సింగిల్స్​లో  వరల్డ్​ నంబన్​ వన్​, పోలాండ్‌‌‌‌‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌ ఇగా స్వైటెక్‌‌‌‌‌‌‌‌ టైటిల్‌‌‌‌‌‌‌‌ ఫేవరెట్‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దిగుతోంది. ఆమెతోపాటు లోకల్‌‌‌‌‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌ కొకో గాఫ్‌‌‌‌‌‌‌‌పై అంచనాలున్నాయి.