బిగ్‌ త్రీపైనే అందరి దృష్టి..నేటి నుంచి యూఎస్ ఓపెన్

బిగ్‌ త్రీపైనే అందరి దృష్టి..నేటి నుంచి యూఎస్ ఓపెన్

న్యూయార్క్‌‌: ఈ ఏడాది చివరి గ్రాండ్‌‌స్లామ్‌‌ యూఎస్‌‌ ఓపెన్‌‌కు రంగం సిద్ధమైంది. సోమవారం మొదలయ్యే ఈ టోర్నీ పురుషుల సింగిల్స్‌‌లో టాప్‌‌ సీడ్‌‌లు.. బిగ్‌‌ త్రీ ప్లేయర్లు  నొవాక్‌‌ జొకోవిచ్‌‌(సెర్బియా), రఫెల్‌‌ నడాల్‌‌(స్పెయిన్‌‌), రోజర్‌‌ ఫెడరర్‌‌(స్విట్జర్లాండ్‌‌) టైటిల్‌‌ ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నారు. ఈ ఏడాది ఫ్రెంచ్‌‌ ఓపెన్‌‌ (నడాల్‌‌ విజేత) మినహా మిగిలిన నాలుగు గ్రాండ్‌‌స్లామ్‌‌లు గెలిచి ఊపుమీదున్న డిఫెండింగ్‌‌ చాంప్‌‌ జొకో టైటిల్‌‌ నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. క్లే కోర్ట్‌‌పై రెచ్చిపోయే నడాల్‌‌ గత టోర్నీలో ఫెడరర్‌‌కు షాకిచ్చి క్వార్టర్స్‌‌కు చేరిన మిల్‌‌మాన్‌‌(ఆస్ట్రేలియా)ను ఫస్ట్‌‌ రౌండ్‌‌లో ఎదుర్కొనున్నాడు.  ఇండియా నుంచి ప్రజ్నేశ్‌‌ గుణేశ్వరన్‌‌, సుమిత్‌‌ నగల్‌‌ బరిలో ఉన్నారు. మంగళవారం జరిగే ఫస్ట్‌‌ రౌండ్‌‌లో ఫెడరర్‌‌తో సుమిత్‌‌ పోటీపడనున్నాడు. మరోవైపు  మహిళల సింగిల్స్‌‌లో డిఫెండింగ్‌‌ చాంపియన్‌‌, వరల్డ్‌‌ నంబర్‌‌ వన్‌‌ నవోమి ఒసాకా (జపాన్‌‌) టైటిల్‌‌ నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉంది. అయితే 24వ గ్రాండ్‌‌స్లామ్‌‌ టైటిల్‌‌తో ఆల్‌‌టైమ్‌‌ రికార్డుపై కన్నేసిన అమెరికా గ్రేట్‌‌ సెరెనా విలియమ్స్‌‌పైనే అందరి దృష్టి ఉంది.  గతేడాది టోర్నీలో రన్నరప్‌‌గా నిలిచిన సెరెనా ఈసారి ఫస్ట్‌‌ రౌండ్‌‌లో రష్యా స్టార్‌‌ మరియా షరపోవాను ఎదుర్కొనుంది. అయితే సెరెనా ఆల్‌‌టైమ్‌‌ రికార్డు వేటకు టాప్‌‌ సీడ్‌‌లు ఒసాకా, యాష్లే బర్టీ, కరోలినా ప్లిస్కోవా, హలెప్‌‌ నుంచి ముప్పు పొంచి ఉంది.