అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయినట్లు ప్రముఖ మీడియా సంస్థ డైలీ మెయిల్ కథనాన్ని ప్రచురించింది.
ఇజ్రాయిల్ – యూఏఈ మధ్య శాంతిని నెలకొల్పేలా కృషి చేసినందుకు గాను నోబెల్ బహుమతి – 2021 సంవత్సరానికి నామినేట్ అయ్యారు.
ప్రపంచ దేశాల మధ్య విభేదాల్ని పరిష్కరించిన ట్రంప్ ను ప్రశంసిస్తూ నార్వేజియన్ పార్లమెంటు సభ్యుడు క్రిస్టియన్ టైబ్రింగ్-జెజెడ్డే నామినేట్ చేశారు.
నాలుగోసారి ఎంపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ట్రైబింగ్ నాటో పార్లమెంటరీ అసెంబ్లీకి నార్వేజియన్ ప్రతినిధి బృందానికి ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు.
నోబెల్ బహుమతికి ట్రంప్ ను నామినేట్ చేసిన సందర్భంగా ట్రైబింగ్ మాట్లాడుతూ.. దేశాల మధ్య శాంతిని నెలకోల్పేలా ట్రంప్ చేస్తున్న కృషి అమోఘమని ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో పాటు భారత్ – పాక్ కాశ్మీర్ సరిహద్దు వివాదం, ఉత్తర కొరియా – దక్షిణ కొరియా దేశాల మధ్య వివాదాల్ని పరిష్కరించేందుకు ట్రంప్ కృషి చేశారని లేఖలో పేర్కొన్నారు.
