
Trump New Tariffs: అమెరికా అధ్యక్షుడు గతంలో ప్రకటించిన టారిఫ్స్ బ్రేక్ గడువు ఆగస్టు 1, 2025తో కొత్త పన్నులను ప్రకటించింది యూఎస్. ప్రస్తుతం ట్రంప్ ప్రకటించిన పన్నులు ఆగస్టు 7 నుంచి అమలులోకి రాబోతున్నాయి. ట్రంప్ నిర్ణయంతో ప్రపంచ వ్యాప్తంగా 70 దేశాలపై 10 శాతం నుంచి 41 శాతం వరకు సుంకాలు అమలు కాబోతున్నాయి. ఆశ్చర్యకరంగా మిత్రదేశమైన ఇండియా పేరు కూడా ఇందులో ఉండటమే. భారత్ నుంచి అమెరికాకు చేసే ఎగుమతులపై కొత్త టారిఫ్స్ కింద 25 శాతం పన్ను విధించబడనుంది.
అమెరికా సూచించినట్లుగా అక్రమ మాదకద్రవ్యాల నిర్మూలించటంలో కెనడా ఫెయిల్ కావటంతో దానిపై సుంకాలను 25 శాతం నుంచి 35 శాతానికి పెంచుతున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. అమెరికా వాణిజ్య లోటును తగ్గించేందుకే తాను టారిఫ్స్ బాట పట్టినట్లు ట్రంప్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే బ్రెజిల్ లాంటి దేశాలపై కూడా ట్రంప్ గతంలో విధించిన పన్నులను పెంచుతున్నారు.
వివిధ దేశాలపై అమలయ్యే కొత్త సుంకాల లిస్ట్..
- *50% Tariffs: బ్రెజిల్
- * 41% Tariff: సిరియా
- * 40% Tariff: లాఓస్, మయన్మార్
- * 39% Tariff: స్విడ్జర్లాండ్
- * 35% Tariff: ఇరాక్, సెర్బియా
- * 30% Tariff: అల్జీరియా, బోస్నియా, హెర్జగోవినా, లిబియా, దక్షిణ ఆఫ్రికా
- * 25% Tariff: భారత్, బ్రూనై, కజాఖ్స్తాన్, మోల్డోవా, ట్యునీషియా
- * 20% Tariff: బంగ్లాదేశ్, శ్రీలంక, తైవాన్, వియత్నాం
- * 19% Tariff: పాకిస్థాన్, మలేషియా, ఇండోనేషియా, కంబోడియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్
- * 18% Tariff: నికరాగ్వా
- * 15% Tariff: ఇజ్రాయెల్, జపాన్, టర్కీ, నైజీరియా, ఘనా
- * 10% Tariff: యూకే, ఫాక్లాండ్ దీవులు