అరబ్ దేశాలు ఏం చేస్తున్నయ్: నిక్కీ హేలీ

అరబ్ దేశాలు ఏం చేస్తున్నయ్: నిక్కీ హేలీ

వాషింగ్టన్: హమాస్‌‌‌‌, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా తమ ప్రాంతాన్ని వదిలి వెళుతున్న గాజా పౌరులను అరబ్ దేశాలు ఎందుకు చేరదీయడంలేదని అమెరికా ప్రెసిడెన్షియల్​ అభ్యర్థి నిక్కీ హేలీ ప్రశ్నించారు. ఇరాన్ అణు ఒప్పందం విషయంలో యూఎస్ మాజీ  అధ్యక్షుడు బరాక్ ఒబామా, ప్రస్తుత ప్రెసిడెంట్​ జో బైడెన్​లను ఆమె తప్పుపట్టారు. హమాస్, హిజ్బుల్లాలను ఇరాన్ బలోపేతం చేస్తోందని ఆరోపించారు. ఆదివారం ఆమె ఓ న్యూస్ చానల్​తో మాట్లాడుతూ.." అమాయకులైన పాలస్తీనా పౌరులను కచ్చితంగా పట్టించుకోవాలి. ఈ విషయంలో అరబ్ దేశాలు ఎక్కడ ఉన్నాయి?  ఖతార్, లెబనాన్, జోర్డాన్,  ఈజిప్ట్ ఏం చేస్తున్నాయి. గాజా పౌరులను వారు తమ దేశాల్లోకి ఎందుకు తీసుకెళ్లడం లేదు.? ఎందుకంటే శరణార్థుల చాటున హమాస్ మిలిటెంట్లు తమ దేశాల్లోకి ప్రవేశిస్తారనే భయంతో అరబ్ దేశాలు గాజా పౌరులను పట్టించుకోవట్లేదు" అని హేలీ విమర్శించారు.