విఘ్నాలను దాటాలి.. గణేశ్ చతుర్థి విషెస్ చెప్పిన జో బిడెన్

విఘ్నాలను దాటాలి.. గణేశ్ చతుర్థి విషెస్ చెప్పిన జో బిడెన్

వాషింగ్టన్: అమెరికా, ఇండియాతోపాటు ప్రపంచ వ్యాప్తంగా గణేశ్ చతుర్థిని సెలబ్రేట్ చేసుకుంటున్న వారికి యూఎస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ జో బిడెన్ విషెస్ చెప్పారు. ‘యూఎస్‌, ఇండియాతోపాటు ప్రపంచ వ్యాప్తంగా హిందువుల పండుగైన గణేశ్ చతుర్థిని జరుపుకుంటున్న వారు విఘ్నాలు దాటాలి. వారికి జ్ఞానాన్ని ప్రసాదించాలి. కొత్త ప్రారంభాల వైపు మార్గాలు కనిపించాలి’ అని బిడెన్ ట్వీట్ చేశారు. యునైటెడ్ స్టేట్స్‌లో అధ్యక్ష ఎన్నికల క్యాంపెయిన్ జోరుగా సాగుతున్న సమయంలో బిడెన్ తాజా ట్వీట్‌ చేయడం గమనార్హం. ప్రచారంలో ఇండియాకు భారీ ప్రాధాన్యతను ఇస్తున్న బిడెన్‌.. భారత్‌తో సంబంధాల బలోపేతానికి, డిఫెన్స్ సామర్థ్యాన్ని పెంచడానికి మద్దతును కొనసాగిస్తామని చెబుతున్నారు.