భారత్ అమెరికా మధ్య స్వేచ్ఛ, సమానత్వమే కీలకం

భారత్ అమెరికా మధ్య స్వేచ్ఛ, సమానత్వమే కీలకం

భారత్ అమెరికా సంబంధాల్లో స్వేచ్ఛ, సమానత్వమే కీలకమన్నారు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్. భారత పర్యటనలో ఉన్న బ్లింకెన్... ఢిల్లీలో విదేశాంగ మంత్రి జైశంకర్ తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికా... ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేసేందుకు మరింత పనిచేయాల్సి ఉందన్నారు. ఆఫ్ఘనిస్తాన్ లో పరిస్థితులు, తాలిబాన్ల గురించి జైశంకర్ తో చర్చించినట్టు చెప్పారు. క్వాడ్ మిలిటరీ ఆర్గనైజేషన్ కాదని... నాలుగు దేశాలు విస్తృత సహకారం కోసం ఏర్పాటు చేసుకున్న వేదిక మాత్రమేనని చెప్పారు. కరోనా సెకండ్ వేవ్ టైమ్ లో అమెరికా అందించిన సాయానికి థ్యాంక్స్ చెప్పారు జైశంకర్. ప్రపంచం మొత్తం అందుబాటు ధరల్లో ఉండేలా వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచుతున్నట్టు జైశంకర్ తెలిపారు.