అమెరికా ప్రకటన.. నవంబర్ 1 నాటికి కరోనా వ్యాక్సిన్‌

అమెరికా ప్రకటన.. నవంబర్ 1 నాటికి కరోనా వ్యాక్సిన్‌

కరోనా వైరస్ వాక్సిన్‌ కోసం ప్రపంచం మొత్తం ఎదురుచుస్తోంది.ఈ క్రమంలో అమెరికా ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. కరోనా వాక్సిన్ వచ్చేస్తోందని.. టీకాల పంపిణీకి సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలకు లేఖ రాసింది. నవంబరు 1 నాటికి టీకాలు ఇచ్చేందుకు అంతా రెడీగా ఉండాలని తెలిపింది. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డైరెక్టర్ రాబర్ట్ రెడ్‌ఫీల్డ్ ఆగస్టు 27న అమెరికాలోని అన్ని రాష్ట్రాల గవ్నర్లకు లేఖ రాశారు. రాష్ట్రాలు, స్థానిక ఆరోగ్యశాఖలు, ఆస్పత్రులకు టీకా పంపిణీ కోసం త్వరలోనే మెక్కెసన్ కార్ప్ (టీకాల పంపిణీ చేసే సంస్థ) నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. కరోనా టీకాల పంపిణీ కార్యక్రమాన్ని స్పీడప్ చేసేందుకు మీ సాయం కావాలని లేఖలో చెప్పారు.దీంతో నవంబరు నెలా ప్రారంభం నుంచే టీకాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చే అవకాశాలున్నాయి. మొదట డాక్టర్లు, హెల్త్ వర్కర్లకు వాక్సిన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత టీకా ఉత్పత్తిని క్రమంగా పెంచి.. అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు.