అమెరికా క్యాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న టెక్ దిగ్గజం మెటా ప్లాట్‌ఫార్మ్స్ మరోసారి ఉద్యోగులను లేఆఫ్ చేసింది. దీంతో సుమారు 600 మంది తాజా తొలగింపులు ప్రధానంగా ఏఐ సంబంధిత విభాగాల్లో జరిగాయని వెల్లడైంది. కంపెనీ తన“సూపర్ ఇంటెలిజెన్స్” ప్రాజెక్టుల దిశగా రిసోర్సెస్ మళ్లించేందుకు తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయంగా అంతర్గత వర్గాలు చెబుతున్నాయి.
కంపెనీ హై పెర్ఫామింగ్ స్మాల్ టీమ్స్ కోసం ప్రయత్నిస్తోందని మెటా చీఫ్ AI ఆఫీసర్ అలెగ్జాండర్ వాంగ్ అన్నారు. ఫలితాలపై దృష్టి సారించే టీమ్స్ మాత్రమే భవిష్యత్తు లక్ష్యాలను సాధించగలవని ఆయన అన్నారు. దీంతో మెటా ఏఐపై తన ఫోకస్ ఏ స్థాయిలో పెట్టిందనే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. రానున్న కాలంలో మెటా భారీగా AI మోడల్ ట్రైనింగ్, AI ఆధారిత యాప్‌ల అభివృద్ధి వంటి కీలక రంగాలపై దృష్టి పెట్టనుందని తెలుస్తోంది.
ALSO READ : కొత్త వ్యాపారంలోకి అదానీ ఎంట్రీ..
ఇదే క్రమంలో మెటా ఉద్యోగులు తమ వర్క్ రివ్యూలలోనూ AI అడుగుపెట్టింది. “మెటామేట్” పేరుతో రూపొందించిన కంపెనీ చాట్‌బాట్ ఇప్పుడు ఉద్యోగులకు వార్షిక పనితీరుపై పెర్ఫామెన్స్ రివ్యూలు రాయడంలో సహాయం చేస్తోంది. ఇది ఉద్యోగుల డాక్యుమెంట్లు, నోట్లు, ఫీడ్‌బ్యాక్‌ను విశ్లేషించి వారి కీ అచీవ్మెంట్స్‌ను సారాంశంగా చూపిస్తుంది. చాలా మంది ఉద్యోగులు దీనిని ఫుల్ ఆటోమేషన్ సాధనంగా కాకుండా ప్రాథమిక టెంప్లేట్‌గా ఉపయోగిస్తున్నారని వెల్లడైంది.
