అమెరికా జూలో నెల క్రితం మంచు చిరుతలకు వైరస్

అమెరికా జూలో నెల క్రితం మంచు చిరుతలకు వైరస్

లింకన్/న్యూఢిల్లీ: అమెరికాలో కరోనాతో మూడు మంచు చిరుతపులులు చనిపోయాయి. నెబ్రాస్కా స్టేట్ రాజధాని లింకన్ సిటీలోని లింకన్ చిల్డ్రన్స్ జూలో ఈ ఘటన జరిగింది. ‘‘మూడు మంచు చిరుతలు, రెండు సుమత్రన్ పులులకు నెల కింద కరోనా సోకింది. అప్పటి నుంచి ట్రీట్ మెంట్ ఇస్తున్నాం. వైరస్ నుంచి సుమత్రన్ పులులు కోలుకోగా, చిరుత పులులు చనిపోయాయి” అని జూ అధికారులు తెలిపారు. అమెరికాలోని చాలా జూలలో జంతువులకు కరోనా సోకింది. సెయింట్ లూయిస్, డెన్వర్ జూలలో పులులు, సింహాలు, హైనాలు, తదితర జంతువులు వైరస్ బారినపడ్డాయి.