మీథేన్​ను వాడితే ఆయిల్​ బిల్లు ఆదా

మీథేన్​ను వాడితే ఆయిల్​ బిల్లు ఆదా

న్యూఢిల్లీ: మనదేశంలోని 2,600 బిలియన్ క్యూబిక్ మీటర్ల కోల్ బెడ్ మీథేన్ నిల్వలలో 10 శాతాన్ని వినియోగించుకుంటే ఇంధన దిగుమతుల బిల్లును 2 బిలియన్ డాలర్లు తగ్గించుకోవచ్చని ఎక్స్​పర్టులు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో బొగ్గు ఉత్పత్తి రికార్డుస్థాయి ఉండటంతో మీథేన్ వినియోగం​పై చర్చ జరుగుతోంది. దానిని మరింత పెంచడానికి ప్రభుత్వం ప్లాన్లు సిద్ధం చేస్తోంది. కోల్ బెడ్ మీథేన్ (సీబీఎం​)ని ఉపయోగించడానికి పరిశ్రమలు చేస్తున్న ప్రయత్నాలు సమీప భవిష్యత్తులో దిగుమతులను తగ్గించగలుతాయని ఎక్స్​పర్టులు భావిస్తున్నారు.

2022–23 సంవత్సరంలో 778.19 మిలియన్ టన్నులకు పైగా బొగ్గు ఉత్పత్తి అయింది. 2025–26 నాటికి ప్రొడక్షన్​ టార్గెట్​ను బిలియన్​ టన్నులకు పెంచుతారని, సీబీఎమ్​​ వాడకం పెరగడం వల్ల కాలుష్యం కూడా తగ్గుతుందని ఇంటర్నేషనల్​ సెంటర్​ ఫర్​ క్లైమేట్​ అండ్​ సస్టెయినబిలిటీ యాక్షన్​ ఫౌండేషన్​ (ఐసీసీఎస్​ఏ) హెడ్​ డాక్టర్​ జేఎస్​ శర్మ చెప్పారు. సీబీఎం​ను ఎంత ఎక్కువ వాడితే ఆయిల్​ బిల్లు అంత తగ్గుతుందని స్పష్టం చేశారని, దీని ప్రాముఖ్యత గురించి తమ సంస్థ అవగాహన కల్పిస్తోందని చెప్పారు. ఇందులో భాగంగా వర్క్​షాప్స్​ కూడా నిర్వహించామని చెప్పారు. మనదేశంలోని 12 రాష్ట్రాల్లో 2,600 బిలియన్​ క్యూబిక్​ మీటర్ల సీబీఎం ఉందని అంచనా.