Vijay Deverakonda: కీర్తి సురేష్ బర్త్‌డే స్పెషల్.. 'రౌడీ జనార్దన్' ఫస్ట్ గ్లింప్స్‌ ‌పోస్టర్‌తో ఫ్యాన్స్‌కి ట్రీట్!

Vijay Deverakonda: కీర్తి సురేష్ బర్త్‌డే స్పెషల్.. 'రౌడీ జనార్దన్' ఫస్ట్ గ్లింప్స్‌ ‌పోస్టర్‌తో ఫ్యాన్స్‌కి ట్రీట్!

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవర్ కొండ, నటి కీర్తి సురేష్ కలిసి నటిస్తున్న చిత్రం 'రౌడీ జనార్దన్' . వీరిద్దరూ జంటగా నటిస్తున్న తొలి సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్ తాజాగా అభిమానులను ఆకట్టుకుంది. ఈ రోజు ( 17, అక్టోబర్ 2025 ) కీర్తి సురేష్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) కీర్తి సురేష్ పాత్ర యొక్క ఫస్ట్ గ్లింప్స్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కిర్తీ సురేష్ బర్త్ డే స్పెషల్..

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో 'రౌడీ జనార్దన్' ఒకటి.  కీర్తి సురేష్ బర్త్ డే ఈ సందర్భంగా, "Her love is poetry, her soul is the song" అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌ను  పోస్ట్ లో SVC జోడించింది. పోస్టర్‌లో కీర్తి పాత్ర యొక్క సిల్హౌట్ కనిపిస్తోంది. ఇది ఆమె పాత్ర ఎంత భావోద్వేగంగా, శక్తివంతంగా ఉండబోతుందో సూచిస్తోంది. కీర్తి పాత్ర చాలా రా అండ్ ఇంటెన్స్ ఉండబోతుందని పోస్టర్ హింట్ ఇస్తోంది. 

 

విజయ్ దేవరకొండ ప్రత్యేక విషెస్‌

కీర్తి సురేష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ హీరో విజయ్ దేవరకొండ కూడా ఈ పోస్టర్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. "హ్యాపీ బర్త్‌డే కీర్తి సురేష్. మీ పుట్టినరోజున ఈ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నందుకు సంతోషంగా ఉంది" అని పోస్ట్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచారాన్ని తన పుట్టినరోజునే ప్రారంభించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

 

రూరల్ యాక్షన్ డ్రామాగా..

 ఈ చిత్రాన్ని 'రాజా వారు రాణి గారు' ఫేమ్ దర్శకుడు రవి కిరణ్ కోల రూపొందిస్తున్నారు. ఇది ఆయనకు రెండవ సినిమా. ఇది ఒక రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోందని, ఇదివరకు విజయ్ పోషించని పూర్తి భిన్నమైన గ్రామీణ నేపథ్య పాత్రలో ఆయన కనిపించనున్నారని సమాచారం.  ఈ భారీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్‌లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది, ప్రస్తుతం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 'ఫ్యామిలీ స్టార్' తర్వాత విజయ్ దేవరకొండ, దిల్ రాజు బ్యానర్లో చేస్తున్న రెండో సినిమా ఇది.

సాంకేతిక నిపుణులలో 'భీష్మపర్వం', 'హెలెన్' వంటి చిత్రాలకు పనిచేసిన ప్రతిభావంతుడైన ఆనంద్ సి చంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. వీరితో పాటు ప్రొడక్షన్ డిజైనర్ డినో శంకర్, కాస్ట్యూమ్ డిజైనర్ ప్రవీణ్ రాజా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానున్న పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ కావడంతో దేశవ్యాప్తంగా విజయ్, కీర్తి అభిమానుల్లో అంచనాలు రెట్టింపయ్యాయి. ఈ పవర్-ప్యాక్డ్ కాంబినేషన్ నుండి మరిన్ని అప్‌డేట్‌ల కోసం సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.