Manchu Lakshmi : OTTలో 'దక్ష' స్ట్రీమింగ్.. క్రైమ్ థ్రిల్లర్ లో మంచు లక్ష్మీ విశ్వరూపం చూడాల్సిందే!

Manchu Lakshmi : OTTలో 'దక్ష' స్ట్రీమింగ్..  క్రైమ్ థ్రిల్లర్ లో మంచు లక్ష్మీ విశ్వరూపం చూడాల్సిందే!

నటి  మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్  యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్‌ చిత్రం 'దక్ష' (ది డెడ్లీ కాన్సిపరెసీ). సెప్టెంబర్ 19న విడుదలైన  ఈ చిత్రం థియేట్రికల్ రన్ ముగియడంతో ఇప్పుడు ఆన్‌లైన్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ విషయాన్ని మంచు లక్ష్మీ తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీపావళి పండుగ సందర్భంగా ఈ శుభవార్తను పంచుకుంటూ డిజిటల్ లాంచ్‌కు సంబంధించిన కొత్త పోస్టర్‌ను పోస్ట్ చేశారు. ఈ చిత్రం అక్టోబర్ 17న ప్రముఖ OTT వేదిక అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది.

'దక్ష' కథాంశం  

'దక్ష' చిత్రంలో మంచు లక్ష్మీ మంచు పవర్ ఫుల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, సీఐ దక్ష పాత్రలో నటించారు. హైదరాబాద్‌లోని కంటైనర్ యార్డ్‌లో జరిగిన ఒక వ్యక్తి యొక్క రహస్య మరణాన్ని ఆమె దర్యాప్తు చేయడంతో కథ మొదలవుతుంది. ఈ కేసును పరిశోధిస్తుండగా, ఒక అమెరికన్ ఫార్మాస్యూటికల్ సంస్థ ప్రతినిధికి సంబంధించిన మరొక హత్య జరుగుతుంది. రెండు కేసుల మధ్య సంబంధాలు ఉన్నట్లు దక్ష గుర్తిస్తుంది. దీని వెనుక మరింత పెద్ద క్రిమినల్ సంస్థ హస్తం ఉందని అనుమానించడం కథకు మలుపు తిప్పుతుంది. 

మంచు లక్ష్మీ  విశ్వరూపం

 ఈ చిత్రంలో మంచు లక్ష్మీ లుక్స్, బాడీ లాంగ్వేజ్ చాలా కొత్తగా, ఆకట్టుకునేలా ఉన్నాయి. హై-ఆక్టేన్ యాక్షన్ సీన్స్ లో ఆమె తన విశ్వరూపం చూపించింది.  అంతే కాదు  ప్రముఖ నటుడు మోహన్ బాబు కూడా ఒక ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించడం విశేషం.  సముద్రఖని, రంగస్థలం మహేష్, , విశ్వంత్ దుద్దుంపూడి వంటి నటులు ముఖ్య పాత్రలు పోషించారు. దర్శకుడు వివేక్ కోనేరు ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను ఆసక్తికరమైన మలుపులతో తెరకెక్కించారు. ఈ సినిమాకి సాయి కార్తీక్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్‌గా నిలిచింది.  ఎమోషన్, యాక్షన్, సస్పెన్స్ అన్నీ సమపాళ్లలో ఉన్న ఈ చిత్రాన్ని ఫ్యామిలీ మొత్తం ఇంట్లోనే చూడవచ్చు ఇప్పుడు..