అమెరికాలో భారీగా పెరిగిన సెకండ్ హ్యాండ్ కార్ల ధరలు.. కారణం ఇదే..

అమెరికాలో భారీగా పెరిగిన సెకండ్ హ్యాండ్ కార్ల ధరలు.. కారణం ఇదే..

US Used Cars: ఎక్కడైనా కొత్త కార్ల కంటే సెకండ్ హ్యాండ్ కార్ల ధరలు తక్కువగా ఉంటాయి. వాడేసిన కార్లకు ఉండే రిపోర్లు, సమస్యలను పరిగణలోకి తీసుకుని కొనేవాళ్లు కూడా వాటిని వీలైనంత తక్కువ రేట్లకు అడుగుతుంటారు. కానీ అమెరికాలో మాత్రం దీనికి రివర్స్‌లో జరుగుతోంది. ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలనే ఇలాంటి విడ్డూరాలకు కారణంగా మారుతోందని తేలింది.

అమెరికాలోని సెకండ్ హ్యాండ్ కార్ల హోల్ సేల్ వేలంలో ధరలు తిరిగి పెరగటం స్టార్ట్ అయ్యింది. కరోనా తర్వాత మళ్లీ రేట్ల పెరుగుదల ఆటో లవర్స్ ని ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆటో టారిఫ్స్ కారణంగా వాహనాల ధరల్లో పెరుగుదల స్టార్ట్ అయ్యిందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. దీనికి అనుగుణంగా మ్యాన్‌హీమ్ ఉపయోగించిన వాహన విలువ సూచిక మే నుండి జూన్‌లో 1.6 శాతం పెరుగుదలను నమోదు చేసింది. వాస్తవానికి ఇది ఆగస్టు 2022 తర్వాత అతిపెద్ద పెరుగుదగా చెప్పబడుతోంది. 

ALSO READ : నష్టాల మార్కెట్లో ఐపీవో లాభాల ఎంట్రీ.. ఖుషీ ఖుషీగా ఇన్వెస్టర్స్..

అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన సుంకాలతో కొత్త ఆటో అమ్మకాలు, సరఫరాలను నిజంగా ప్రభావితం చేసిందని తేలింది. ధరల ఒత్తిళ్లు సాధారణంగా సంవత్సరం రెండవ భాగంలో తగ్గుతాయని ధరల ఒత్తిళ్లు సాధారణంగా సంవత్సరం రెండవ భాగంలో తగ్గుతాయని ఆర్థిక అండ్ పరిశ్రమ  సీనియర్ డైరెక్టర్ జెరెమీ రాబ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉపయోగించిన కార్ల మార్కెట్‌లోకి లీజుకు వచ్చిన వాహనాల సరఫరా తగ్గుముఖం పడుతోందని చెప్పారు. అందుకే సెకండ్ హ్యాండ్ వాహనాల ధరలు పెరుగుతున్నాయని చెప్పారు. 

ప్రస్తుతం అమెరికాలోకి దిగుమతి చేసుకునే ఆటో ఉత్పత్తులపై 25 శాతం సుంకాలకు ట్రంప్ ప్రకటన కొత్త వాహనాల ధరల పెంపుకు దారితీస్తుందని తెలుస్తోంది. వినియోగదారులు దీని నుంచి తప్పించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు సెకండ్ హ్యాండ్ మార్కెట్లో వాహన ధరలను ప్రేరేపిస్తున్నాయని ఆటో నిపుణులు చెబుతున్నారు. ఫెడ్ అధికారులు కూడా ఏదో ఒక రకమైన ధరల పెరుగుదల వస్తుందన్నారు. ట్రంప్ చర్యల మధ్య రేట్ల తగ్గింపుకు కూడా ఫెడ్ వెనకాడటం తెలిసిందే.