ఒక్కో ప్రైవేట్ స్కూల్ నుంచి రూ. 2 వేలు

ఒక్కో ప్రైవేట్ స్కూల్ నుంచి రూ. 2 వేలు

ఏటా యూజర్ చార్జీల వసూలుకు సర్కార్ ఆదేశం 

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ గుర్తింపు ఉన్న ప్రైవేటు స్కూళ్ల నుంచి ఏటా రూ.2 వేల చొప్పున యూజర్ చార్జీలు వసూలు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఆన్​లైన్ ​ద్వారా స్కూల్ రికగ్నైజేషన్, రెన్యువల్ కోసం అప్లై చేసుకున్న వారి నుంచి యూజర్ చార్జీలు తీసుకోవాలని ప్రభుత్వ కార్యదర్శి జనార్దన్​రెడ్డి  ఉత్తర్వులు జారీచేశారు. ఏటా వెబ్ సైట్​ను యూజ్ చేసినందుకు రూ. 2 వేలు చార్జీగా వసూలు చేయాలని స్కూల్​ఎడ్యుకేషన్​ కమిషనర్​విజయ్​కుమార్ నిర్ణయం తీసుకున్నారు. యూజర్ చార్జీల ద్వారా స్కూల్​ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ కు ఏటా సుమారు రూ.2 కోట్లకు పైగా ఆదాయం సమకూ రుతుందని పేర్కొంటున్నారు.