బుల్లి ఎలాన్ మస్క్.. ఎంత అందంగా ఉన్నాడో కదా!

బుల్లి ఎలాన్ మస్క్.. ఎంత అందంగా ఉన్నాడో కదా!

ఈ ఫోటో చూశాక ట్విటర్‌ అధినేత, టెస్లా సీఈవో 'ఎలాన్‌ మస్క్‌' చిన్నప్పుడు ఇలా ఉండేవారేమో అని అనుకోవడం సహజం. కానీ అది వాస్తవం కాదు. మస్క్ చిన్నప్పుడు ఇలా ఉండేవారంటూ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతో ఓ యూజర్ రూపొందించిన చిత్రమిది. కొద్ది రోజుల క్రితం భారతీయ వరుడి గెటప్‌లో మురిసిపోయిన మస్క్, ఇప్పుడు చిన్నపిల్లాడిలా మరోసారి నెటిజెన్ల ముందుకొచ్చాడు.      

ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతో మస్క్‌ చిత్రాలను రోజుకోరకంగా మారుస్తున్నారు. ఇప్పటికే యువ్వనం, వృద్ధ వయస్సులో రూపొందించిన చిత్రాలు అయిపోగా.. ఇప్పుడు పిల్లాడి వంతు వచ్చింది. వీటికి మస్క్‌ సైతం అంతే వైవిధ్యంగా స్పందిస్తున్నారు. ఏదేమైనా బుల్లి ఎలాన్ మస్క్.. చాలా అందంగా ఉన్నాడంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

కాగా, 199 బిలియన్ డాలర్ల సంపదతో టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ప్రపంచకుబేరుడుగా అగ్రస్థానంలో కొనసాగుతునున్నారు.